AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఈ అందాల అక్కా చెల్లెలతో నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?

హీరోలు చాలా మంది ఉన్నారు కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మలు గుర్తున్నారా.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ బామలదే హవా..

Tollywood : ఈ అందాల అక్కా చెల్లెలతో నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Nagma, Jothika, Roshini
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2022 | 10:46 AM

Share

టాలీవుడ్ లో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు హీరోలుగా హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలా వున్నాయి. హీరోలు చాలా మంది ఉన్నారు కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మలు గుర్తున్నారా.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ భామలదే హవా.. ముఖ్యంగా నగ్మా.  అందాలతారగా అప్పట్లో నగ్మా ఒక సన్సేషన్. ఆమె నటనకు.. అందంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నగ్మా. అప్పట్లో నగ్మా హీరోయిన్ అంటే చాలు ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేది. ఇక నగ్మా సిస్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జోతిక. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన జోతిక హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా హీరోయిన్ గా సినిమాలు చేశారు.

అయితే ఏ ముగ్గురు హీరోయిన్స్ తో నటించిన ఏకైక హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఇప్పటికి హీరోగా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ భామల్లో జోతిక మినహా మిగిలిన వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ఆ స్టార్ హీరో నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరంటే..

ఇంకెవరు మన మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి పైన కనిపిస్తున్న ముగ్గురు సిస్టర్స్ తో సినిమాలు చేశారు. ఈ భామలు చిరు సరసన హీరోయిన్స్ గా నటించిన సినిమాలు ఏవంటే.. నగ్మా , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాల్లో ఘరానా మొగుడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే జోతికతో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఠాగూర్.వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రోషినితో కలిసి చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించారు.

ఇవి కూడా చదవండి
Megastar

Megastar

Follow Us
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రైతన్నలకు తీపి కబురు.. ఈ జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు!
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్
రెండు సెంచరీలు కొట్టినా నా ఓటు వాడికే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్