Monster: ఓటీటీలోకి మోహన్‌లాల్‌ మాన్‌స్టర్‌.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

థియేటర్లలో అలరించిన మాన్‌స్టర్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌లో డిసెంబర్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, మలయాళం, తమిళ్‌, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది.

Monster: ఓటీటీలోకి మోహన్‌లాల్‌ మాన్‌స్టర్‌.. తెలుగులో స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Mohanlal
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2022 | 9:49 PM

ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. అందుకే ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు తెలుగులో విడుదలవుతుంటాయి. కాగా ఇటీవలే మాన్‌స్టర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారీ మలయాళం సూపర్‌స్టార్‌. టాలీవుడ్‌కు చెందిన మంచు లక్ష్మి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. దీపావళి కానుకగాఅక్టోబరు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. పులి మురుగన్ (మన్యం పులి) సినిమా తో మోహన్ లాల్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించిన దర్శకుడు వైశాఖ్ మాన్‌స్టర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కాగా థియేటర్లలో అలరించిన మాన్‌స్టర్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌లో డిసెంబర్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తెలుగు, మలయాళం, తమిళ్‌, హిందీ భాషల్లోనూ మాన్‌స్టర్‌ ప్రసారం కానుంది. ఈ మేరకు డిస్నీ+ హాట్‌స్టార్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఓ పాప కిడ్నాప్‌ నేపథ్యంగే సాగే ఈ థ్రిల్లర్‌ సినిమాలో లక్కీసింగ్‌ అనే పాత్రలో కనిపించారు మోహన్‌లాల్‌. మరి థ్రిల్లర్‌ సినిమాను ఇష్టపడేవారు ఎంచెక్కా ఇంట్లోనే మాన్‌స్టర్‌ చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!