AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRP Rating: బుల్లితెరపై కూడా సత్తా చాటిన ఆ రెండు సినిమాలు.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో తగ్గేదేలే..

ప్రస్తుతం అంతా ఓటీటీ హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ వేదికగా విడుదలవుతోంది. దీంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య పెరిగిపోయింది. ముందు థియేటర్‌, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో సినిమాలు వస్తున్నాయి. దీంతో బుల్లి తెరపై సినిమాలు చూసే వారి..

TRP Rating: బుల్లితెరపై కూడా సత్తా చాటిన ఆ రెండు సినిమాలు.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో తగ్గేదేలే..
Narender Vaitla
|

Updated on: Dec 02, 2022 | 7:03 AM

Share

ప్రస్తుతం అంతా ఓటీటీ హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీ వేదికగా విడుదలవుతోంది. దీంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య పెరిగిపోయింది. ముందు థియేటర్‌, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో సినిమాలు వస్తున్నాయి. దీంతో బుల్లి తెరపై సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. అయితే కథలో కంటెంట్‌ ఉండాలే కానీ ఎన్నిసార్లు టెలికాస్ట్‌ అయినా సినిమాకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గదని రెండు చిత్రాలు నిరూపించాయి. వీటిలో ఒకటి సీతారామం కాగా మరొకటి కార్తికేయ2.

దాదాపు ఒకటే సమయంలో విడుదలైన ఈ రెండు చిత్రాలు ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు కరోనా కారణంగా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించని ప్రేక్షకులను ఈ రెండు చిత్రాలు రప్పించేలా చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్లను కలెక్ట్‌ చేసి దుమ్మురేపాయి ఈ చిత్రాలు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం చిత్రానికి రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి.

Karthikeya Sita Ramam

ఇవి కూడా చదవండి

కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ రెండు చిత్రాలు సత్తా చాటాయి. హైయెస్ట్ వ్యూస్‌తో దుమ్మురేపాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ రెండు చిత్రాలు బుల్లి తెరపై కూడా సందడి చేశాయి. ఇటీవల టీవీలో ప్రసారమైన సీతారామం చిత్రానికి 8.73 టీర్‌పీ రేటింగ్‌ వచ్చింది. ఇక కార్తికేయ2 7.88 రేటింగ్‌ను అందుకుంది. కథలో కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులకు సినిమాలను ఇష్టపడతారు అనడానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్స్‌గా నిలిచాయి ఈ రెండు చిత్రాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!