Mukhachitram Trailer: ఆద్యంతం ఆసక్తికరంగా ముఖచిత్రం ట్రైలర్.. ఎన్నెన్నో మలుపులు.. ఊహించని ట్విస్టులు..
ముక్కోణపు ప్రేమకథ అంటూ మొదలైన ట్రైలర్.. ఎన్నెన్నో మలుపులతో ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరం గా ఉంది.
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ట్రైలర్.. ముక్కోణపు ప్రేమకథ అంటూ మొదలైన ట్రైలర్.. ఎన్నెన్నో మలుపులతో ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఆసక్తికరం గా ఉంది. ఒక అమ్మాయి ముఖానికి పాస్టిక్ సర్జరీ చేసి మరో అమ్మాయిలా మారిస్తే ఏం జరుగుతుంది. వాళ్ల పాత్రలకు హీరోకు ఉన్న సంబంధం ఏంటీ ఇలాంటి అంశాలతో క్యూరియాసిటిని కలిగిస్తోంది.
అలాగే వెర్సటైల్ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు రవిశంకర్, విశ్వక్ సేన్ ల మధ్య కోర్ట్ డ్రామా మరింత ఆసక్తి రేపగా ట్రైలర్ లో లాస్ట్ ట్విస్ట్ ఇంప్రెసివ్ గా ఉంది. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.