AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginna OTT: మంచు విష్ణు జిన్నా ఓటీటీ డేట్‌ వచ్చేసిందోచ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్‌ 21న థియేటర్లలో విడుదలైన జిన్నా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే రోటీన్‌ స్టోరీ కావడంతో ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కానీ సినిమాలోని కామెడీ సీన్లు, విష్ణు నటన, పాయల్, సన్నీ లియోన్‌ అందచందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Ginna OTT: మంచు విష్ణు జిన్నా ఓటీటీ డేట్‌ వచ్చేసిందోచ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Ginna
Basha Shek
|

Updated on: Dec 01, 2022 | 6:35 PM

Share

మోసగాళ్లు తర్వాత భారీ గ్యాప్‌ తీసుకున్న మంచు విష్ణు జిన్నాగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఈషాన్‌ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్లుగా నటించారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్లర్‌కు కాస్త కామెడీని జోడించి వినోదాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్‌ 21న థియేటర్లలో విడుదలైన జిన్నా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే రోటీన్‌ స్టోరీ కావడంతో ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కానీ సినిమాలోని కామెడీ సీన్లు, విష్ణు నటన, పాయల్, సన్నీ లియోన్‌ అందచందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్న జిన్నా ఓటీటీలోనైనా హిట్‌ కొట్టేద్దామని వచ్చేస్తున్నాడు.

జిన్నా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. డిసెంబర్ 2 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. పేరుకు శుక్రవారం అని చెప్పినా… గురువారం (అనగా ఈ రోజు) రాత్రి నుంచి ఓటీటీలో సినిమా వీక్షకులకు అందుబాటులోకి వస్తుంది. కాగా ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు నాగేశ్వర రెడ్డి కథను అందించగా, కోన వెంకట్ స్ర్కీన్‌ప్లే సమకూర్చారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌ మెంట్‌, యూనివర్సల్‌ స్టూడియోలతో కలిసి 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఈ సినిమాను నిర్మించారు. జిన్నా సినిమాలో అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సీనియర్ నరేష్, సునీల్, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు ఇతరులు నటించారు. ఈ సినిమాతో తన కుమార్తెలు అరియానా – వివియానాను సింగర్స్‌గా పరిచయం చేశారు విష్ణు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?