- Telugu News Photo Gallery Cricket photos Bangladesh Team 32 run all out vs Newzealand women cricket T20I
32 పరుగులకే ఆలౌట్.. 6 పరుగులే అత్యధిక స్కోర్.. టీ20 మ్యాచ్‌లో132 పరుగుల తేడాతో ఘోర ఓటమి
న్యూజిలాండ్‌లో ఆడటం ఏ ఆసియా జట్టుకైనా కష్టమే. అది పురుషుల జట్టు అయినా, మహిళల జట్టు అయినా. ఇక ఒక జట్టు మొదటిసారి అక్కడ ఆడుతున్నట్లయితే ఇక్కట్లు తప్పవు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టుది అదే పరిస్థతి. మొదటిసారిగా న్యూజిలాండ్‌లో T20 మ్యాచ్ ఆడుతున్న ఆజట్టు కేవలం 32 పరుగులకే ఆలౌటైంది.
Updated on: Dec 02, 2022 | 10:33 PM

Nz Vs Ban

న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య మొదటిసారి T20 సిరీస్ జరుగుతోంది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో పర్యాటక జట్టు చిత్తుగా ఓడిపోయింది. న్యూజిలాండ్ వారిని 132 పరుగుల తేడాతో ఓడించింది.

కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ సోఫీ డివైన్ 34 బంతుల్లో 45 పరుగులు చేయగా, మాడీ గ్రీన్ 23 బంతుల్లో 36 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది

అనుభవం లేని బంగ్లాదేశ్ జట్టుకు ఈ లక్ష్యం కష్టతరమైనది. అయితే జట్టు కనీసం పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆ జట్టు మొత్తం 11 మంది ఆటగాళ్లు కలిసి 89 బంతుల్లో అంటే 14.5 ఓవర్లలో కేవలం 32 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

బంగ్లాదేశ్ చేసిన అతిపెద్ద స్కోరు కేవలం 6 పరుగులు కాగా, ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేదు. న్యూజిలాండ్‌కు చెందిన లియా తహుహు 4 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.





























