- Telugu News Photo Gallery Cricket photos Mithali Raj Birthday special know life story of hyderabad born indian womens cricketer
Mithali Raj Birthday: శెభాష్ మిథూ.. మహిళల క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేసిన హైదరాబాదీ క్రికెటర్
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఇటీవల క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ తీసుకుంది. ఆమె 23 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.
Updated on: Dec 03, 2022 | 2:54 PM

2017లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు ఎప్పుడూ చూడని ఓ దృశ్యం కెమెరాలో కనిపించింది. గ్యాలరీలోని ప్రేక్షకులందరూ భారత అమ్మాయిల బ్యాటింగ్‌ను ఆసక్తికరంగా చూస్తుండగా జట్టు కెప్టెన్ మాత్రం బౌండరీ లైన్ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతూ కనిపించింది. ఈ ప్లేయర్ మరెవరో కాదు మన లేడీ సచిన్, హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్.

మిథాలీ రాజ్ ఇటీవల తన 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ఇటీవలే గుడ్‌బై చెప్పింది. ఈరోజు (డిసెంబర్ 3) ఆమె పుట్టినరోజు. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత మిథాలీరాజ్‌కు దక్కుతుంది.

మిథాలీ రాజ్ తన చిన్నతనంలో క్రికెట్‌తో పాటు భరతనాట్యం కూడా నేర్చుకుంది. అయితే మిథాలీ రాజ్ తండ్రి మాత్రం తన కూతురు క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. ఆ సమయంలో భారత్‌లో మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేదు.

మిథాలీ రాజ్ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసింది. అదే సమయంలో, 2004 సంవత్సరంలో, కేవలం 22 సంవత్సరాల వయస్సులో, ఆమె టీమ్ ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంది. తద్వారా బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు కొత్త దారి చూపించింది. ఆమె సారథ్యంలోనే 2017 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఓడిపోయింది.

మహిళా క్రికెటర్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా మిథాలీ రాజ్ పేరిట ఉంది. ఆమె మొత్తం మూడు ఫార్మాట్లలో 333 మ్యాచ్‌లలో 10869 పరుగులు చేసింది. మిథాలీ క్రికెట్ కెరీర్‌లో 8 సెంచరీలు, 85 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులో అత్యధిక పరుగుల ఇన్నింగ్స్‌లో (214రన్స్) ఆమే పేరిటనే ఉంది. అంతేకాదు డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలు ఘనత కూడా మిథాలీదే.





























