Watch Video: ఫుట్‌బాల్‌తో ఇరగదీసిన ఎన్టీఆర్, రాంచరణ్.. తోడైన అల్లు అర్జున్.. నెట్టింట్లో దూసుకపోతోన్న ఈ వీడియో చూశారా..
Viral Video: బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించిన రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు, ఫిఫా ప్రపంచ కప్‌నకు ఏంటి లింక్ అనుకుంటున్నారా..
Trending Video: ఖతార్‌లో జరుగుతోన్న ఫిఫా ప్రపంచ కప్‌లో పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులంతా ఈ పోటీల కోసం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏ దేశం ఫిఫా ట్రోఫీని ముద్దాడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మరోవైపు ఫుట్‌బాల్ మేనియాలో ప్రపంచం అంతా ఊగిపోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుట్ బాల్ గురించి వీడియోల జాతర కనిపిస్తోంది. ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా చేరింది.
బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించిన రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు, ఫిఫా ప్రపంచ కప్‌నకు ఏంటి లింక్ అనుకుంటున్నారా.. విషయం అంతా ఓ పాటలో ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే, కొంతమంది ‘నాటు’ సాంగ్‌లోని అద్భుత స్టెప్‌లో రామ్ చరణ్, ఎన్‌టీర్ ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు క్రియోట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
When it comes to football, Ram and Bheem are just goals ⚽?#RRR pic.twitter.com/62d65vAist
— Golden (@netflixgolden) December 2, 2022
ఈ వీడియోలో భీమ్, రామ్‌లు డ్యాన్స్ చేస్తూ అద్భుతంగా గోల్ చేసినట్లు చూపించారు. ఇక అభిమానులు మాత్రం ఫిఫాకు మన స్టార్స్‌ను కూడా పంపిస్తే బాగుండేది. ఇలా ఆడితే ఈజీగా గోల్ కొట్టేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫిఫా ట్రెండ్‌తో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది. దీంతోపాటు అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్న వీడియోకు కూడా ఫుట్‌బాల్ వీడియోను జోడించి ట్రెండ్ చేస్తున్నారు.
We think we watched the wrong #FIFAWorldCup.@alluarjun#ZEE5Global #GlobalDesi #Iddarammayilatho #AlluArjun pic.twitter.com/Kis3qld8IS
— ZEE5 Global (@ZEE5Global) November 24, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..