IPL 2023 Mini Auction: మినీ వేలంలో 991 మంది ప్లేయర్లు.. అత్యధికంగా ఆ రెండు దేశాల నుంచే.. పూర్తి జాబితా ఇదే..

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 50 మందికి పైగా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అసోసియేట్ జట్ల నుంచి 20 మంది ఆటగాళ్లు ఈసారి వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

IPL 2023 Mini Auction: మినీ వేలంలో 991 మంది ప్లేయర్లు.. అత్యధికంగా ఆ రెండు దేశాల నుంచే.. పూర్తి జాబితా ఇదే..
Ipl records
Follow us
Venkata Chari

|

Updated on: Dec 02, 2022 | 9:30 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ (ఐపీఎల్ 2023)కి ఇంకా చాలా సమయం ఉంది. అయితే, ప్రస్తుతం మినీ వేలం (ఐపీఎల్ వేలం) సందడి కొనసాగుతోంది. ఈ నెల 23న కొచ్చిలో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఏ ఆటగాళ్లను ఎంపిక చేస్తారు, ఎంత మంది క్రీడాకారులు అత్యధిక ధర పొందుతారనేది 23వ తేదీనే ఖరారు కానుంది. ప్రస్తుతం, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ వేలం కోసం, భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

ఐపీఎల్ 2023 సీజన్ వేలానికి ముందు, నవంబర్ 15 నాటికి, మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఇందులో, కొన్ని జట్లు సగం కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను విడుదల చేయగా, కొన్నిజట్లు కొంతమంది ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేశాయి. దీంతో ఇప్పుడు మిగిలిన స్థలాల కోసం వేలం నిర్వహించనున్నారు. అయితే ఇందుకోసం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

మినీ వేలం విశేషాలు..

  1. 991 మంది ఆటగాళ్లలో, మొత్తం 714 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 19 మంది ఆటగాళ్లు క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు
  2. విదేశీ ఆటగాళ్ల సంఖ్య 277 కాగా, ఇందులో 166 మంది క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఈ 277 మంది ఆటగాళ్ళు 14 వేర్వేరు దేశాలకు చెందినవారు.
  3. ఇవి కూడా చదవండి
  4. విదేశీ ఆటగాళ్లలో, 20 మంది ఆటగాళ్లు అసోసియేట్ జట్లకు చెందినవారు. అంటే, ICCలో పూర్తి స్థాయి సభ్యుల హోదా లేని జట్లలోని ఆటగాళ్ల కూడా ఉన్నాయి.
  5. మరోవైపు, అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌లలో (అంతర్జాతీయ క్రికెట్ ఆడని వారు) ఐపీఎల్ మునుపటి సీజన్‌లలో ఆడిన 91 మంది పేర్లు ఉన్నాయి.
  6. అదేవిధంగా, మునుపటి IPL సీజన్లలో ఆడిన అన్‌క్యాప్డ్ ఫారినర్‌లలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు.
  7. రిజిస్టరైనవారిలో ఇప్పటి వరకు ఐపీఎల్ ఒక్క సీజన్ కూడా ఆడని అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ల సంఖ్య 604 కాగా, విదేశీ ఆటగాళ్ల సంఖ్య 88.
  8. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ తన జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు.
  9. ప్రతి ఫ్రాంఛైజీ తన పూర్తి జట్టుకు అంటే వేలంలో 25 మంది ఆటగాళ్లను చేర్చుకుంటే, మొత్తం 87 మంది ఆటగాళ్లను వేలంలో విక్రయించగలరు. వీరిలో 30 మంది ఆటగాళ్లు మాత్రమే విదేశీయులు కావచ్చు.

ఏ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎంత మంది?

మొత్తం 277 మంది విదేశీ ఆటగాళ్లలో, కేవలం రెండు జట్ల నుంచే అత్యధిక ప్లేయర్లు ఉన్నారు. ఇందులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 57 మంది, ఆపై దక్షిణాఫ్రికా నుంచి 52 మంది ఆటగాళ్లు రేసులోకి దిగనున్నారు. అదే సమయంలో, నెదర్లాండ్స్, యుఎఇ, నమీబియా, స్కాట్లాండ్ వంటి జట్ల నుంచి కూడా ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

దేశం ఆటగాళ్లు
ఆఫ్ఘనిస్తాన్ 14
ఆస్ట్రేలియా 57
బంగ్లాదేశ్ 6
ఇంగ్లండ్ 31
ఐర్లాండ్ 8
నమీబియా 5
నెదర్లాండ్స్ 7
న్యూజిలాండ్ 27
స్కాట్లాండ్ 2
దక్షిణ ఆఫ్రికా 52
శ్రీలంక 23
యూఏఈ 6
వెస్టిండీస్ 33
జింబాబ్వే 6

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?