Actress Pragathi: పెళ్లిలో రచ్చ చేసిన ప్రగతి.. డోలుపై కూర్చొని తీన్మార్‌ డ్యాన్స్

ఈ ఏడాది ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాల్లో కనిపించి అలరించిన ఈ సీనియర్‌ నటి సామాజిక మాధ్యమాల్లోనూ హవా కొనసాగిస్తోంది. జిమ్‌, వర్కవుట్‌ వీడియోలతో పాటు డ్యాన్సింగ్‌ వీడియోలతో మంచి ఫేమ్‌ సొంతం చేసుకుంటోంది.

Actress Pragathi: పెళ్లిలో రచ్చ చేసిన ప్రగతి.. డోలుపై కూర్చొని తీన్మార్‌ డ్యాన్స్
Actress Pragathi
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2022 | 7:35 PM

ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ దూసుకుపోతోంది ప్రముఖ నటి ప్రగతి. ఈ ఏడాది ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాల్లో కనిపించి అలరించిన ఈ సీనియర్‌ నటి సామాజిక మాధ్యమాల్లోనూ హవా కొనసాగిస్తోంది. జిమ్‌, వర్కవుట్‌ వీడియోలతో పాటు డ్యాన్సింగ్‌ వీడియోలతో మంచి ఫేమ్‌ సొంతం చేసుకుంటోంది. ఇటీవలే సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేసిన ప్రగతి డైట్‌, బ్యూటీ టిప్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే ఇటీవల తన సోదరి పెళ్లికి హాజరైంది ప్రగతి. పెళ్లి వేడుకల్లో భాగంగా హుషారైన స్టెప్పులతో హోరెత్తించింది. ఏకంగా డోలుపై కూర్చొని తీన్మార్‌ డ్యాన్స్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ‘ నా సోదరి పెళ్లి. కామ్‌గా అసలు ఉండలేను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది ప్రగతి.

ప్రగతి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది ప్రగతి ఎనర్జీ లెవెల్స్‌ను మెచ్చుకుంటుంటే మరికొందరు మాత్రం డోలుపై అలా కూర్చొని డ్యాన్స్‌ చేయడాన్ని తప్పుపడుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం అదిరిపోయిందంతే అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే సూపర్‌ మచ్చి, డీజే టిల్లు, ఎఫ్‌ 3, రంగరంగ వైభవంగా, స్వాతిముత్యం, భగీరా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మెగాస్టార చిరంజీవి హీరోగా నటిస్తోన్న భోళా శంకర్‌ సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..