Allu Arjun: అల్లు అర్జున్‍తో సినిమా చేయాలని ఆశపడుతున్న బాలీవుడ్ టాప్ డైరెక్టర్.. తనకు ఆ ముగ్గురు హీరోలో చాలా స్పెషల్ అంట..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించి స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు డైరెక్టర్ రోహిత్ శెట్టి. ప్రస్తుతం ఆయన రూపొందించిన సర్కస్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. ఊర మాస్ లుక్ లో స్మగ్లర్ పుష్ప రాజ్ గా కనిపించారు. ఇక ఇందులో బన్నీ మేకోవర్.. నటనకు ఉత్తరాది ఆడియన్స్ మాత్రమే కాదు.. డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా రష్యాలో విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్యాలో చిత్రయూనిట్ తోపాటు.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా సందడి చేస్తున్నారు. అయితే బన్నీతో కలిసి సినిమా చేయడం తనకు చాలా ఇష్టమన్నారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించి స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు డైరెక్టర్ రోహిత్ శెట్టి. ప్రస్తుతం ఆయన రూపొందించిన సర్కస్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. డిసెంబర్ 2న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ ఈవెంట్లో పాల్గోన్న రోహిత్ శెట్టి సౌత్ హీరోస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తనకు సౌత్ హీరోస్ అజిత్ కుమార్, అల్లు అర్జున్, కార్తీ లతో కలిసి పనిచేయడం ఇష్టమన్నారు. ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రతి హీరోతో కలిసి సినిమాలు చేయడం తనకు చాలా ఇష్టమని.. అజిత్.. విజయ్, అల్లు అర్జున్, కార్తీతో పాటు అందరితో కలిసి పనిచేయడం ఇష్టమంటూ చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రణ్‌వీర్ సింగ్ గెటప్స్, లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రోహిత్ శెట్టి మళ్ళీ తన కామెడీతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.