AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: జూబ్లీహిల్స్‏లో 84 ఎకరాల్లో ప్రభాస్‏కు విలాసవంతమైన ఫామ్‏హౌస్ ?.. అసలు విషయం చెప్పేసిన బాహుబలి నిర్మాత..

తాజాగా ప్రభాస్ గురించి మరో న్యూస్ తెరపైకి తీసువచ్చింది ఓ వెబ్ సైట్. జూబ్లీహిల్స్‏లో ఏకంగా 84 ఎకరాల్లో ప్రభాస్‏కు విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉందని ఓ వెబ్ సైట్ పెద్ద ఆర్టికల్ రాసేశారు.

Prabhas: జూబ్లీహిల్స్‏లో 84 ఎకరాల్లో ప్రభాస్‏కు విలాసవంతమైన ఫామ్‏హౌస్ ?.. అసలు విషయం చెప్పేసిన బాహుబలి నిర్మాత..
Prabhas, Shobu
Rajitha Chanti
|

Updated on: Dec 02, 2022 | 6:13 PM

Share

ఇటీవల కొద్ది రోజులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు సంబంధించి పలు రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్‏తో డార్లింగ్ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక తమ సినిమా బేధియా ప్రమోషన్ల కోసం కృతి, హీరో వరుణ్ ధావన్ సైతం ప్రభాస్ పేరును ఇష్టానుసారంగా వాడేసుకున్నారు. ఒకరేమో ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పగా.. మరొకరు ఏకంగా డార్లింగ్ మనసులో ఆ హీరోయిన్ ఉందంటూ అతి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓవర్‏నైట్‏లోనే ప్రభాస్..కృతి సనన్ డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్స్ పై ప్రభాస్ ఏమాత్రం స్పందించకుండా సైలెంట్‏గా ఉన్నారు. అయితే తమ సినిమా ప్రమోషన్ కోసం డార్లింగ్ పేరును ఇష్టానుసారంగా ఉపయోగించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట సీరియస్ అయ్యారు. దీంతో తమ మధ్య ఏలాంటి రిలేషన్ షిప్ లేదని కృతి చెప్పగా.. కేవలం తను సరదాగానే చేసిన వ్యాఖ్యలు ఓ ఛానెల్ ఎడిట్ చేసిందంటూ వివరణ ఇచ్చుకున్నాడు వరుణ్. అయితే ఈ రూమర్స్ సద్దుమణగడంతో.. తాజాగా ప్రభాస్ గురించి మరో న్యూస్ తెరపైకి తీసువచ్చింది ఓ వెబ్ సైట్. జూబ్లీహిల్స్‏లో ఏకంగా 84 ఎకరాల్లో ప్రభాస్‏కు విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉందని పెద్ద ఆర్టికల్ రాసేశారు.

జూబ్లీహిల్స్‏లో ప్రభాస్‏కు 84 ఎకరాల్లో ఓ విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉందని.. దానిని కేవలం రూ. 1.05 కోట్లకే సొంతం చేసుకున్నట్లు సదరు వెబ్ సైట్ పేర్కొంది. ప్రస్తుతం ఆ ఫామ్ హౌస్ విలువ దాదాపు రూ. 60 కోట్లు ఉండొచ్చని రాసుకొచ్చింది. ఇందుకు రాధేశ్యామ్ సినిమాలోని ఓ ఫోటోను కూడా వాడేసింది. దీంతో ఈ వార్తలపై నెటిజన్స్ సందేహాలు వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో 84 ఎకరాలు..అది కూడా కేవలం కోటి రూపాయలతో సొంతం చేసుకోవడమేంటనీ షాకవుతున్నారు. తాజాగా ఈ వార్తలపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.

ఇవి కూడా చదవండి

“ఏంటి, నిజమా ?.. అసలు జూబ్లీ హిల్స్ లో 84 ఎకరాలు అంటే దాని విలువెంతుంటుందో మీకేమైనా తెలుసా ?. ఏదో ఒక చెత్త రాసేసి దానికి ఓ సెలబ్రిటీ పేరును జోడించడం బాగా అలవాటైపో యింది. విలాసవంతమైన.. సరమైళమైన ఓకే వ్యాక్యంలో ఎలా ఉంటుంది ” అంటూ చురకలంటించాడు. అటు డైరెక్టర్ మారుతి సైతం ప్రభాస్ విల్లాకు ఇంకా రాధేశ్యామమ్ ఇంటీరియర్ డిజైనే వాడుతున్నట్లున్నారే ? అంటూ సెటైర్స్ వేశారు. ప్రస్తుతం ప్రభాస్.. ప్రాజెక్ట్ కె, సలార్, సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.