Guess This Celebrity: బాగా బక్కచిక్కిపోయిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా మరి ?

Basha Shek

Basha Shek |

Updated on: Dec 03, 2022 | 9:06 PM

యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ యాసలో ఆమె పలికే డైలాగులు, నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అదే పాపులారిటీతో బిగ్‌బాస్‌ హౌస్లోకి అడుగపెట్టి ఏకంగా ఫినాలే వరకు చేరుకుంది.

Guess This Celebrity: బాగా బక్కచిక్కిపోయిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా మరి ?
Actress

స్మార్ట్‌ ఫోన్‌, సోషల్‌ మీడియా విస్తృతి పెరిగాక సినిమా తారలు, ఫ్యాన్స్‌కు మధ్య దూరం బాగా తగ్గిపోయింది. నిత్యం తమ గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. నెటిజన్లు కూడా సినిమా తారల ఫొటోలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. వాటిపై లైకులు, కామెంట్ల షేర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక ఫొటోనే నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఇందులో ఉన్నది ఒక ప్రముఖ తెలుగు నటి. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలంగాణ యాసలో ఆమె పలికే డైలాగులు, నటనకు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అదే పాపులారిటీతో బిగ్‌బాస్‌ హౌస్లోకి అడుగపెట్టి ఏకంగా ఫినాలే వరకు చేరుకుంది. ప్రస్తుతం ప్రైవేట్‌ అల్బమ్స్‌తో పాటు వెబ్‌ సిరీస్‌లు, అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది. అంతేకాదు సోషల్‌మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. అలా ఈ బ్యూటీ షేర్‌ చేసిన ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

ఈమె మరెవరో కాదు.. యూట్యూబ్‌ స్టార్‌ అలేఖ్య హారిక అలియాస్‌ దేత్తడి హారిక. సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే ఈ సొగసరి తన తాజా ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇందులో ఆమె బాగా బక్కచిక్కిపోయినట్లు కనిపిస్తుంది. యూట్యూబ్ లో దేత్తడి అనే ఛానెల్ ద్వారా పాపులారిటీ సాధించిన హారిక చాలా తక్కువ సమయంలోనే క్రేజ్‌ను దక్కించుకుంది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ యాసతో ఆమె పలికే డైలాగులకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు. ఇకబిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈ అమ్మడికి ఆఫ‌ర్స్ బాగానే వ‌చ్చాయి. ప‌లు సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటించి మెప్పించింది.

View this post on Instagram

A post shared by Alekhya Harika (@alekhyaharika_)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu