Bigg Boss 6 Telugu: రేవంత్‌ కూతురును లైవ్‌ లో చూపించిన బిగ్‌బాస్‌.. అమ్మ పాట ఆలపించి ఎమోషనలైన స్టార్‌ సింగర్‌

బిడ్డ పుట్టిన  గుడ్‌న్యూస్‌ను బిగ్‌బాస్‌ సింగర్‌కు తెలియజేయడంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తాజాగా రేవంత్‌కి జీవితాంతం గుర్తుండిపోయే మధురజ్ఞాపకాలను అందించాడు బిగ్‌బాస్‌.

Bigg Boss 6 Telugu: రేవంత్‌ కూతురును లైవ్‌ లో చూపించిన బిగ్‌బాస్‌.. అమ్మ పాట ఆలపించి ఎమోషనలైన స్టార్‌ సింగర్‌
Singer Revanth
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2022 | 7:34 PM

స్టార్‌ సింగర్‌ రేవంత్‌ ఇటీవల తండ్రిగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. గురువారం (డిసెంబర్‌ 1) అతని భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు రేవంత్‌.  బిడ్డ పుట్టిన  గుడ్‌న్యూస్‌ను బిగ్‌బాస్‌ సింగర్‌కు తెలియజేయడంతో అతను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. తాజాగా రేవంత్‌కి జీవితాంతం గుర్తుండిపోయే మధురజ్ఞాపకాలను అందించాడు బిగ్‌బాస్‌. అతనిని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ‘రేవంత్ మీకో శుభవార్త.. నిన్న (గురువారం) రాత్రి 11.51 నిమిషాలకు మీకు కూతురు జన్మించింది’ అని చెప్పారు. అంతేకాకుండా లైవ్‌లో తన పాపను కూడా చూపించాడు. పాపను, భార్యను చూసి రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఇది చాలు బిగ్ బాస్ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. జూనియర్ రేవంత్ పుట్టిందని చెప్పు అంటూ తన బిడ్డను చూసుకుంటూ భార్యతో మాట్లాడాడు. అనంతరం.. ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’ అంటూ పాట పాడి ఎమోషనల్ అయ్యాడు.. సార్ నేను ఇక్కడే గెలిచాను సార్’ అంటూ బిగ్ బాస్‌కి థాంక్స్ చెప్పాడు రేవంత్.ఇక తోటి కంటెస్టెంట్లు కూడా కేకలు పెడుతూ.. విజిల్స్ వేస్తూ సంబరాలు చేసుకుంటూ తాజా ప్రోమో ఎంతో ఎమోషనల్‌గా సాగింది.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ తుది దశకు చేరుకుంది. పదమూడో వారానికి గానూ రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య,రోహిత్, ఫైమా నామినేషన్‌ లిస్టులో ఉన్నారు. ఇక ఓటింగ్‌లో రేవంత్ ముందుండగా.. రోహిత్‌ రెండోప్లేసులో ఉన్నాడు. కామన్‌ మ్యాన్‌ ఆదిరెడ్డి థర్డ్ ప్లేసులో ఉండగా.. కీర్తి నాలుగో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో శ్రీసత్య ఉంటే.. ఫైమా లీస్ట్ ఓటింగ్‌తో ఆఖరి స్థానంలో ఉంది. దీంతో ఈ వారంలో ఫైమా ఎలిమినేట్ అవుతందనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..