Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి స్కెచ్.. విన్నర్‌ని ఫిక్స్ చేసే లోపలికి పంపినప్పుడు ఆడియెన్స్ పిచ్చోళ్లా

ఆదిరెడ్డికి స్కెచ్ గీశారా..? కామన్ మ్యాన్ ఆదిరెడ్డిని బయటకు పంపాలని ఫిక్స్ అయ్యారా..? సిగ్నల్స్ అలానే అందుతున్నాయి మరి..

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి స్కెచ్..  విన్నర్‌ని ఫిక్స్ చేసే లోపలికి పంపినప్పుడు ఆడియెన్స్ పిచ్చోళ్లా
Bigg Boss Revanth -Adireddy
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2022 | 12:11 PM

బిగ్ బాస్ సీజన్ 6.. ఎండింగ్‌కు చేరుకుంది. ఈ సీజన్ మాత్రం ప్రేక్షకులకు కావాల్సినంత కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు కాస్త కేర్ తీసుకోవాలని దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజంట్ నామినేషన్స్‌లో రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య,రోహిత్, ఫైమా 6 మెంబర్స్ ఉన్నారు. ఇక ఓటింగ్‌లో యధావిధిగానే రేవంత్ ముందున్నాడు. ఊహించని విధంగా ఫైర్ బ్రాండ్‌లా సెకండ్ ప్లేసులోకి దూసుకొచ్చాడు రోహిత్. మెరీనా వెళ్లిన తర్వాత అతడి ఆటతీరులో ఊహించని మార్పు వచ్చింది. ఎక్కడా తగ్గట్లేదు. తనకు శక్తికి మించి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అందుకే వీక్షకులు రోహిత్‌కు మద్దతుగా ఓట్లు వేశారు. ఆదిరెడ్డి థర్డ్ ప్లేసులో ఉండగా.. కీర్తి నాలుగవ స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో శ్రీసత్య ఉంటే.. ఫైమా లీస్ట్ ఓటింగ్‌తో లాస్ట్‌లో ఉంది.

దీంతో గత వారం ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్‌’తో సేవ్ అయిన ఫైమా.. ఈసారి బయటకు వచ్చే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఫినాలేకు వెళ్లేది ఐదుగురే. కానీ ప్రజంట్ హౌస్‌లో 8 మంది ఉన్నారు. మిగిలి ఉన్నదేమో 2 వారాలు. అంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండాలి. లేదా ఒకరిని మిడ్ వీక్.. అయినా చేయాలి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఫైమాతో పాటు శ్రీసత్య కూడా బయటకు రావాల్సిందే.

అయితే శ్రీసత్యకు బదులుగా ఆదిరెడ్డిని బయటకు పంపించే ప్లానింగ్ జరుగుతున్నట్లు ఉప్పు అందుతుంది. ఓటింగ్ అనేది లీస్ట్ బోదర్ ఇక్కడ. మీ ఓట్లకు విలువిచ్చి డిసైడ్ చేస్తే.. అక్కడ తమకు కావాల్సిన కంటెంట్ రాదు కాబట్టి.. పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ చూసి ఎవర్నీ ఉంచాలో, ఎవర్నీ పంపాలో డిసైడవుతారు. ఇది చాలామంది బహిరంగంగా చెబుతున్న విషయమే. అందుకే మేడమ్ శ్రీసత్యను సేవ్ చేసేందుకు.. కామన్ మ్యాన్ ఆదిరెడ్డికి స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతంది. ఇక విన్నర్‌‌గా మెచ్యూర్డ్ రేవంత్‌ని పంపేటప్పుడే డిసడయ్యారు అనుకుంట అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే అతడు ఆచితూచి మాట్లాడతాడు. ఏదైనా పాయింట్ టూ పాయింట్ చెప్పేస్తాడు కదా అని వెటకారంగా ఆన్సర్ ఇస్తున్నారు. అతడి ప్రవర్తన చూసి.. బాబోయ్ పద్దతికి ప్యాంట్, షర్ట్ వేసినట్లు ఉంటాడు అని సెటైర్లు పేల్చుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!