AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi-Jagati: బుల్లి తెరపై తల్లీకొడుకులు జగతి, రిషీలు.. నిజజీవితంలో వీరి వయసులో ఎంత తేడానో తెలుసా..

బుల్లి తెరపై తల్లి కొడుకులైన రిషి,జగతిలకు నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ లేదు. జ్యోతి రాయ్  1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే సాగింది.

Rishi-Jagati: బుల్లి తెరపై తల్లీకొడుకులు జగతి, రిషీలు.. నిజజీవితంలో వీరి వయసులో ఎంత తేడానో తెలుసా..
Mukesh Goud, Jyothi Rai
Surya Kala
|

Updated on: Dec 03, 2022 | 10:39 AM

Share

తెలుగు సీరియల్స్ లో ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతోంది గుప్పెడంత మనసు. తక్కువ సమయంలోనే తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. పంతం పట్టుదల, ప్రేమ, ఆత్మాభిమానం సంఘర్షణల మధ్య కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతున్న ఈ సీరియల్ యువతని బాగా ఆకట్టుకుంది. ఇందులో ప్రధాన పాత్రలైన రిషి, వసుధారా, జగతి, మహేంద్రలు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని చెప్పవచ్చు. అయితే ఈ సీరియల్ మరో విశేషం ఏమిటంటే.. హీరో రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ, వసుధారా గా నటిస్తున్న రక్షాగౌడ, జగతి పాత్రలో జీవిస్తున్న జ్యోతి రాయ్ లు కన్నడ నటులు. రిషిగా ఈ కన్నడ కుర్రాడు ముఖేష్ గౌడ తెలుగులో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. జగతిగా జ్యోతి రాయ్ కు మహిళా లోకం పట్టంగట్టారు. ఇంకా చెప్పాలంటే..

కార్తీక దీపం సీరియల్ లో సౌందర్య పాత్ర తర్వాత అంత అందంగా, హుందాగా నడుస్తున్న పాత్ర గుప్పెడంత మనసులో జగతి పాత్ర. పుట్టింటి వారు కష్టాల్లో ఉంటే తల్లిదండ్రుల కోసం కన్న ప్రేమని, కట్టుకున్న భర్తకు దూరమై.. కొడుకు ప్రేమ కోసం,, తల్లి అనే పిలుపు కోసం ఆర్తిగా ఎదురు చూసే పాత్రలో ఆకట్టుకుంటోంది. తన శిష్యురాలు చదువుకోసం నిరంతరం తపించే జగతి నటనకు బుల్లి తెరప్రేక్షకులు ఫిదా.. మరోవైపు మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడకి రుషి పాత్రలో మంచి క్రేజ్ వచ్చింది. తల్లిపై కోపం, తండ్రిపై ప్రేమ, స్టూడెంట్ ఉన్నతి, కాలేజీ ఎండిగా రిషి నటన యూత్ ను ఆకట్టుకుంది.

అయితే బుల్లి తెరపై తల్లి కొడుకులైన రిషి,జగతిలకు నిజ జీవితంలో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ లేదు. జ్యోతి రాయ్  1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే సాగింది. తొమ్మిదేళ్ల క్రితం తెలుగులో కన్యాదానం అనే సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇప్పుడు జగతి వయసు 36 ఏళ్ళు. పలు కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కి పెళ్లైంది. ఓ బాబు ఉన్నాడు

ఇవి కూడా చదవండి

ముఖేష్ గౌడ కర్ణాటకలోని మైసూర్ లో 8 నవంబర్ 1994న జన్మించాడు. మహావీర్ విద్యా మందిర్‌లో పాఠశాల విద్యను.. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చదువు తర్వాత మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2017లో.. ‘ నాగకన్నికే ‘ అన్న కన్నడ సీరియల్‌తో అరంగేట్రం చేశాడు.  తెలుగులో ప్రేమ నగర్ సీరియల్ తో అడుగు పెట్టాడు. గుప్పెడంత మనసుతో తెలుగు ప్రేక్షకుల గుప్పెడంత గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు ప్రస్తుతం రిషి వయసు 28 ఏళ్ళు. దీంతో బుల్లి తెరపై తల్లికొడుకులైన జ్యోతి రాయ్, ముఖేష్ గౌడ ల మధ్య వయసు తేడా నిజజీవితంలో 8 ఏళ్ళు మాత్రమే కావడం విశేషం..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..