Childhood Photo: వెండి తెరపై గొప్ప నటులు ఈ తల్లి కూతురు.. అమ్ము నుంచి అమ్మగా ఖ్యాతిగాంచిన మహిళ.. ఎవరో గుర్తు పట్టారా..!

భర్త మరణంతో కుటుంబ పోషణ భారం వేదవల్లిమీద పడింది. దీంతో సంధ్యగా పేరు మార్చుకుని సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. మాయాబజార్ సినిమాలో రుక్ష్మిణిగా నటించింది సంధ్యనే.. తెలుగు, తమిళ సినిమాల్లో సహాయ నటిగా పని చేస్తూ జీవనం సాగించవలసి వచ్చింది.

Childhood Photo: వెండి తెరపై గొప్ప నటులు ఈ తల్లి కూతురు.. అమ్ము నుంచి అమ్మగా ఖ్యాతిగాంచిన మహిళ.. ఎవరో గుర్తు పట్టారా..!
Jayalalithaa With Her Mothe
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2022 | 11:10 AM

సినిమా, రాజకీయం.. ఈ రెండు విభిన్న రంగాల్లో సక్సెస్ అయిన మహిళలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది జయలలిత. వివాదాలు, విమర్శలు, ఆరోపణలు అవమానాలు ఎన్ని ఎదురైనా వాటికీ ఎదురునిలిచి పోరాడి విజయం సాధించిన ధీర వనిత. అమ్ము నుంచి అమ్మగా ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తి దాయకం.. యువతిగా అపర సౌందర్య రాశి.. సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. రాజకీయాల్లో అడుగు పెట్టి.. పేదలకు అండగా నిలిచి అమ్మగా ప్రజలకు చేరువయ్యారు. తల్లి అడుగు జాడల్లో నడుస్తూ.. కుటుంబం కోసం సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు జయలలిత. ఫిబ్రవరి 24 న జయలలిత మైసూర్ రాష్ట్రంలో జన్మించారు. తల్లి దండ్రులు జయకుమార్, వేద వల్లి.  జయలలిత తండ్రి జయకుమార్ లాయర్ చదివినప్పటికీ పని చేసేవారు కాదు. వ్యసన పరుడై చిన్న వయసులోనే మరణించారు. భర్త మరణంతో కుటుంబ పోషణ భారం వేదవల్లిమీద పడింది. దీంతో సంధ్యగా పేరు మార్చుకుని సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. మాయాబజార్ సినిమాలో రుక్ష్మిణిగా నటించింది సంధ్యనే.. తెలుగు, తమిళ సినిమాల్లో సహాయ నటిగా పని చేస్తూ జీవనం సాగించవలసి వచ్చింది. షూటింగ్ తో బిజిబిజీ లైఫ్.. సమయం దొరికినప్పుడు జయలలితతో  తాను ముద్దుగా పిలుచుకునే అమ్మూతో గడిపేవారు.

తండ్రి మరణించే సమయానికి జయలలితకు రెండేళ్లు. జయలలిత 10 ఏళ్ల వయసులో చెన్నైలోని చర్చి పార్క్ పాఠశాలలో చేరారు.  జయలలిత స్కూల్లో బెస్ట్ స్టూడెంట్.. ఆటపాటల్లో చదువులో అన్నింటిలోనూ రాణించారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్ నృత్యాలను అభ్యసించారు. జయలలిత 12 సంవత్సరాల వయస్సులో రంగస్థలంపై అరంగ్రేటం చేశారు. తల్లి సంధ్య ఈ ప్రదర్శనకు గౌరవ అతిథిగా శివాజీ గణేశన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఈ అమ్మాయి నిజంగా బంగారు విగ్రహంలా అందంగా ఉందని, భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆమె చిత్ర పరిశ్రమలోకి వచ్చి స్టార్ హీరోయిన్ అవుతుందని జోస్యం చెప్పారు.

జయలలిత కుటుంబానికి డబ్బు అవసరం కావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలనటిగా శ్రీశైల మహాత్య అనే కన్నడ సినిమాలో పార్వతి దేవిగా కనిపించారు. 15 ఏళ్ల వయసులో 1964 లో కన్నడ సినిమా “చిన్నది గొంబే ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్  అవడంతో సినీ కెరీర్ లో మళ్ళీ వెనుదిగిరి చూడలేదు జయలలిత. తెలుగులో మనసు మమత చిత్రంలో ఏఎన్నార్ కి జోడీగా నటించి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత డ్యాన్సులతో అడగొట్టడమే కాకుండా తాను నటించే పాటలను సొంతంగా పాడుకునే వారు. మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు. 60, 70 దశకంలో తెలుగు, తెలుకు, కన్నడ సినిమాల్లో టాప్ హీరోయిన్. సినీ కెరీర్ లో ఆమె ఐదు భాషల్లో దాదాపు125 సినిమాలు చేస్తే అందులో 110 హిట్ అయ్యాయి.  అనంతరం రాజకీయాల్లో మారి అక్కడ కూడా సంచలన విజయాన్ని సాధించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పేదల పాలిట పెన్నిధిగా అమ్మగా ఖ్యాతిగాంచారు. అమ్ము అమ్మగా మారి మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.

ఇవి కూడా చదవండి

అయితే తనకు మళ్ళీ మరొకసారి జీవించడానికి అవకాశం వస్తే.. పాఠశాల విద్యార్ధినిగా జీవించాలనుకుంటున్నానని చెప్పిన జయలలిత బాల్యం అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..