Liquor Robbery: ‘జంబలకిడిపంబ’ని మించిన సీన్.. మందు కోసం ‘మగువ’ ఆరాటం..అర్ధరాత్రి గునపం చేతపట్టి..

Basha Shek

Basha Shek |

Updated on: Dec 03, 2022 | 8:50 PM

.ఓ మహిళ కూడా తన తాగుడు అలవాటును నియంత్రించుకోలేకపోయింది. అర్ధరాత్రి రోడ్లపైకి వెళ్లి లిక్కర్‌ షాప్‌లో వైన్‌ను దొంగలించే ప్రయత్నం చేసింది. అయితే ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

Liquor Robbery: ‘జంబలకిడిపంబ’ని మించిన సీన్.. మందు కోసం ‘మగువ’ ఆరాటం..అర్ధరాత్రి గునపం చేతపట్టి..
Liquor Robbery

కొన్ని చెడు అలవాట్లను ఎప్పటికీ నియంత్రించుకోలేం. వాటితో అన్ని విధాలా ముప్పు ఉందని తెలిసినప్పటికీ విడిచిపెట్టలేం. అలాంటి చెడు అలవాట్లలో ధూమపానం, మద్యపానం కూడా ఒకటి. ముఖ్యంగా తాగుడు విషయంలో చాలామంది నియంత్రణ పాటించలేరు. అందుకే అర్ధరాత్రిళ్లోనూ కొందరు మందు కోసం రోడ్ల వెంట తిరుగుతుంటారు. సమయం మించిపోయి మద్యం దుకాణాలు మూసివేసినా వాటి తలుపులు పోగొట్టి మరీ లిక్కర్‌ బాటిళ్లను దొంగతనంగా తీసుకెళుతుంటారు. సాధారణంగా పురుషులే ఇలాంటి రాత్రి సమయాల్లో లిక్కర్‌ షాపులను షట్టర్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడుతుంటారు. అయితే విధి విచిత్రమేమో..ఓ మహిళ కూడా తన తాగుడు అలవాటును నియంత్రించుకోలేకపోయింది. అర్ధరాత్రి రోడ్లపైకి వెళ్లి లిక్కర్‌ షాప్‌లో వైన్‌ను దొంగలించే ప్రయత్నం చేసింది. అయితే ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో రాత్రివేళ ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. ముఖానికి ముసుగు కప్పుకుని మద్యం కోసం వైన్‌ షాపు దగ్గరకు వెళ్లిన మహిళ తాళం వేసి ఉన్న షటర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించింది. పెద్ద రాడుతో లిక్కర్‌ షాపు తాళం పగులగొట్టేందుకు ట్రై చేసింది. అయితే తాళం ఎంతకు పగలకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైంది.

ఇదే సమయంలో విధుల్లో భాగంగా ఓ పోలీస్‌ పోలీసు పెట్రోలింగ్‌ వాహనం సౌండ్‌ చేసుకుంటూ అక్కడికి వచ్చింది. దీంతో వెంటనే అక్కడి నుంచి ఆ మహిళ పారిపోయింది. ఇదంతా ఇదంతా షాపు బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అ‍య్యింది. ఇప్పుడు ఇదే వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ట్రెండ్‌ మారింది గురూ’.. ‘అమ్మాయిలు కూడా ఇలా చేస్తున్నారేంటి’, ‘పురుషులతో సమానంగా మహిళలు కూడా ఎందులోనూ తక్కువకాదంటూ మరోసారి నిరూపించారు’ అని సటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu