Hamsa Nandini: గుడ్‌ న్యూస్‌ చెప్పిన మిర్చి బ్యూటీ.. క్యాన్సర్‌ను జయించి షూటింగ్‌కు హాజరైన హంసానందిని

కాగా సినిమాలు, స్పెషల్‌ సాంగులతో బిజీగా ఉన్న ఈ అందాల తార 2021 డిసెంబర్‌లో ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాను క్యాన్సర్‌ బారిన పడినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Hamsa Nandini: గుడ్‌ న్యూస్‌ చెప్పిన మిర్చి బ్యూటీ.. క్యాన్సర్‌ను జయించి షూటింగ్‌కు హాజరైన హంసానందిని
Hamsa Nandini
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2022 | 7:20 PM

హీరోయిన్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఆతర్వాత స్పెషల్‌ సాంగ్స్‌తో తెలుగు తెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హంసానందిని. 2007లో వంశీ తెరకెక్కించిన అనుమానాస్పదం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అందాల తార అధినేత, ప్రవరాఖ్యుడు, అహనా పెళ్లంట,ఈగ తదితర సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. ఆతర్వాత మిర్చి, భాయ్‌, రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్‌, లౌక్యమ్‌, బెంగాల్‌ టైగర్‌, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు సినిమాల్లో స్పెషల్‌ సాంగులతో అలరించింది. మధ్యలో రుద్రమదేవి, పంతంలాంటి సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. కాగా సినిమాలు, స్పెషల్‌ సాంగులతో బిజీగా ఉన్న ఈ అందాల తార 2021 డిసెంబర్‌లో ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాను క్యాన్సర్‌ బారిన పడినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నట్లు చెప్పిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక శుభవార్త చెప్పింది. సుమారు ఏడాదిగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె 16 సైకిల్స్‌ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్న హంసా నందిని తిరిగి షూటింగ్‌లోనూ పాల్గొనడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది.

నాకిది పునర్జన్మ..

‘సినిమా సెట్లో ఉంటే ఆ అనుభూతే వేరు. ఇది నాకు మరో పునర్జన్మ లాంటిది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు. ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో బర్త్‌ డే వేడుకలు జరుపుకుంటాను. ఇలాంటి సందర్భాన్ని ఎలా మిస్‌ అవుతాను? అభిమానుల ప్రేమ, ఆప్యాయతల వల్లే నేను కోలుకుని రాగలిగాను. అందరికీ కృతజ్ఞతలు. ఐ యామ్‌ బ్యాక్‌’ అని తన ఆనందాన్ని పంచుకుంది హంసానందిని. కాగా సుమారు 19 ఏళ్ల క్రితం హంసానందిని తల్లి కూడా క్యాన్సర్‌తో కన్నుమూసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..