Faima: ఫైమాకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన పటాస్‌ ప్రవీణ్‌.. ఖరీదైన కానుకతో అదిరిపోయే సర్‌ప్రైజ్

చాలా సందర్భాల్లో జబర్దస్త్ వేదికపై ఫైమాతో ప్రేమ విషయంపై ఓపెన్‌ అయ్యాడు ప్రవీణ్‌..' నేను ఫైమాను ప్రేమిస్తున్నాను.. పెళ్లి కూడా చేసుకుంటాను అని ప్రవీణ్‌ కామెంట్స్ చేయడం.. దానికి ఫైమా సైలెంట్ గా సిగ్గు పడడం' చాలాసార్లు జరిగింది.

Faima: ఫైమాకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన పటాస్‌ ప్రవీణ్‌.. ఖరీదైన కానుకతో అదిరిపోయే సర్‌ప్రైజ్
Faima, Patas Praveen
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2022 | 8:14 PM

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన జబర్దస్త్‌ ఫైమాకు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓపెన్‌ టాప్‌ కారులో ఆమెను ఎక్కించుకుని నగర వీధుల్లో ఫ్యాన్స్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఫైమా, మరో జబర్దస్త్‌ కమెడియన్‌ పటాస్‌ ప్రవీణ్‌ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే చాలా సందర్భాల్లో జబర్దస్త్ వేదికపై ఫైమాతో ప్రేమ విషయంపై ఓపెన్‌ అయ్యాడు ప్రవీణ్‌..’ నేను ఫైమాను ప్రేమిస్తున్నాను.. పెళ్లి కూడా చేసుకుంటాను అని ప్రవీణ్‌ కామెంట్స్ చేయడం.. దానికి ఫైమా సైలెంట్ గా సిగ్గు పడడం’ చాలాసార్లు జరిగింది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై అయితే ఫైమాపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసి, ఆమె వేలికి ప్రవీణ్‌ ఉంగరం తొడిగారు. ఇవన్నీ స్కిట్లలో భాగంగానే జరిగినా వారిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చేలా బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చిన ఫైమాకు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు ప్రవీణ్‌.

కడప దర్గా నీళ్లతో..

తాజాగా తన ఫ్యామిలీ మెంబర్స్‌ ముఖ్యంగా పటాస్‌ ప్రవీణ్‌ తనకు ఎలా స్వాగతం చెప్పారో చూడండంటూ తన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఫైమా. ఇందులో ప్రవీణ్‌.. ఫైమాతో కేక్‌ కట్‌ చేయించాడు. ఆ తర్వాత కడప దర్గాలో పూజ చేయించిన నీళ్ల బాటిల్‌ను ఆమె చేతికిచ్చి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నాడు . తర్వాత తన మెడలో ఉన్న బంగారు గొలుసును ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది ఫైమా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బిగ్‌బాస్‌ హౌస్‌లో టాప్‌-5లో నిలవలేకపోయినా తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది ఫైమా. రియాలిటీ షో మొదలైనప్పటి నుంచే ఫిజికల్‌ గేమ్స్, టాస్కులు, ఫన్‌ గేమ్స్‌లో అదరగొట్టింది. ముఖ్యంగా షో టాప్‌ కంటెస్టెంట్‌గా పేరు వినిపిస్తోన్న స్టార్‌ సింగర్‌ రేవంత్‌ తో సై అంటే సై అని ఎదురుదాడికి దిగింది. ఆమె ఆటతీరును చూస్తుంటే కచ్చితంగా టాప్‌-5లో నిలుస్త్ఉందని భావించారు. అయితే అనూహ్యంగా హౌజ్‌ నుంచి బయటికి వచ్చింది. అయితే రోహిత్‌ను ఎడాపెడా తిట్టడం వల్లే ఫైమాకు నెగిటివిటీ వచ్చిందని, అందుకే ఎలిమినేట్‌ అయ్యిందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ