Asmitha: అప్పుడు నన్ను ఎగతాళి చేశారు.. ఇప్పుడు వాళ్లు ఫాలో అవుతున్నారు.. నటి అస్మిత కామెంట్స్ వైరల్..

యష్ ట్రిక్స్ పేరుతో ఆమె ఓపెన్ చేసిన ఛానల్.. తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆమె షేర్ చేసిన వీడియోలకు అభిమానులు కూడా ఎక్కువే ఉనవ్నారు. తాజా ఆమె A1 From Day 1 అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ ప్రివ్యూకీ యాష్ ట్రిక్స్ ఫ్యామిలీని ప్రత్యేక

Asmitha: అప్పుడు నన్ను ఎగతాళి చేశారు.. ఇప్పుడు వాళ్లు ఫాలో అవుతున్నారు.. నటి అస్మిత కామెంట్స్ వైరల్..
Asmita
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2022 | 12:27 PM

బుల్లితెర ప్రేక్షకులకు నటి అస్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అటు సీరియల్స్.. ఇటు సినిమాలతో తెలుగు ఆడియన్స్‏కు చేరువయ్యింది. ఓవైపు సీరియల్స్‏తో బిజీగా ఉన్న సమయంలోనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి… పలు ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేసింది అస్మిత. యష్ ట్రిక్స్ పేరుతో ఆమె ఓపెన్ చేసిన ఛానల్.. తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆమె షేర్ చేసిన వీడియోలకు అభిమానులు కూడా ఎక్కువే ఉనవ్నారు. తాజా ఆమె A1 From Day 1 అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ ప్రివ్యూకీ యాష్ ట్రిక్స్ ఫ్యామిలీని ప్రత్యేక అతిథులుగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా అస్మిత మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన మొదట్లో తనను ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు సొంతంగా ఛానల్ ఓపెన్ చేశారని తెలిపారు.

అస్మిత మాట్లాడుతూ.. “నటిగా నా కెరియర్ బిజీగా ఉన్న సమయంలోనే డిజిటల్ మీడియా వైపు అడుగులు వేశాను. అటు సీరియల్స్.. సినిమాలు చేస్తూనే.. వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ సమయంలోనే ఇప్పుడు ఎందుకు ఇదంతా ? అంటూ తోటి నటీనటుల నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. దీన్ని ఎవరు చూస్తారు ? అనే మాటలు విన్నాను. అప్పుడు నన్ను ఎగతాళి చేసినవారే ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయడం సంతోషంగా ఉంది. యాష్ ట్రిక్స్ విజయం వెనక నా భర్త సుధీర్ సహకారం చాలా ఉంది. పెళ్లి, పిల్లలతో మహిళల కెరియర్ ఆగిపోతుందనే కాన్సెప్ట్ నాకసలు అర్థం కాదు. దీనిని నేను అస్సలు నమ్మను. అందుకే యాష్ ట్రిక్స్ స్టార్ట్ చేశాను.

ఆ తర్వాత ఎలాంటి వీడియోస్ చేయాలి అని మొదటి నుంచి చాలా ఆలోచించాను. మనకు రోజు అవసరమయ్యే విషయాలనే మా వీడియోలుగా మార్చాము. ఇప్పుడు యాష్ ట్రిక్స్ నుంచి ఓ వెబ్ సిరీస్ విడుదల చేస్తున్నారు. నేను.. సుధీర్ భార్యభర్తలుగా నటిస్తున్న ఈ సిరీస్ లో కమెడియన్ అలీ గారు ముఖ్యమైన పాత్రను పోషించారు. డిసెంబర్ 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని చూసేందుకు రూ. 59 ధర నిర్ణయించాము. ఈ సిరీస్ తప్పుకుండా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాము”.. అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.