AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchathantram Review: పంచతంత్రం.. పంచేంద్రియాలను స్పృశించే ఎమోషనల్ డ్రామా..

తెలుగు ఇండస్ట్రీలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా వచ్చే సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన సినిమా పంచతంత్రం. ఐదు విభిన్నమైన కథల సమాహారంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Panchathantram Review: పంచతంత్రం.. పంచేంద్రియాలను స్పృశించే ఎమోషనల్ డ్రామా..
Panchathantram Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajitha Chanti|

Updated on: Dec 10, 2022 | 12:57 PM

Share

నటీనటులు: డా. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణన్, శ్రీ విద్యా మహర్ద

సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి

సినిమాటోగ్రఫర్: రాజ్ కె నల్లి

ఇవి కూడా చదవండి

ఎడిటర్: గ్యారీ బి హెచ్

దర్శకుడు: హర్ష పులిపాక

నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్

తెలుగు ఇండస్ట్రీలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా వచ్చే సినిమాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలా వచ్చిన సినిమా పంచతంత్రం. ఐదు విభిన్నమైన కథల సమాహారంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఓ రిటైర్డ్ ఉద్యోగి వేదవ్యాస్ మూర్తి (డా. బ్రహ్మానందం) అరవై ఏళ్ల వయసులో రైటర్ గా కొత్త పెరిగి మొదలు పెట్టాలి అనుకుంటాడు. దీనికోసం స్టోరీ టెల్లింగ్ పోటీలో పాల్గొంటాడు. ఈ క్రమంలోనే ఆయన ఐదు కథలను సిద్ధం చేసుకుని వెళ్తాడు. ఆ ఐదు కథల ఇతివృత్తం మనిషి పంచేంద్రియాల చుట్టూ తిరుగుతుంటాయి. మొదటి కథ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరేష్ అగస్త్య చుట్టూ తిరుగుతుంది దీని ఇతివృత్తం వినడం. ఆ తర్వాత రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ నేపథ్యం రుచి. జీవితంలో పర్ఫెక్ట్ భాగస్వామి అంటూ ఉండదు అడ్జస్ట్మెంట్ తో ముందుకు వెళ్లడమే లైఫ్ అనేది ఈ కథ ఉద్దేశం. ఇక మూడవ కథ ఇతివృత్తం వాసన. ఇందులో సముద్రఖని ఉంటాడు. నాలుగో కథ స్పర్శ. వికాస్ ముప్పాలా, దివ్య శ్రీపాద పోషించిన భార్యాభర్తలపై ఎమోషనల్ స్టోరీ. చివరి కథ ఇతివృత్తం దృశ్యం. ఇలా 5 కథల్ని చెప్పి స్టోరీ టెల్లింగ్ పోటీలో గెలుస్తాడు వేదవ్యాస్.

కథనం:

సాధారణంగా ఒక సినిమా కథ అంటే రెండు గంటలు ఒకే ఫ్లో ఉంటుంది. ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది కానీ.. పంచతంత్రం సినిమా మాత్రం అలా కాదు ఒకే సినిమాలో ఐదు కథలు చూపించాడు దర్శకుడు హర్ష పులిపాక. వాటిని చాలా తెలివిగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఫస్టాఫ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరేష్ అగస్త్య బీచ్ చూడాలని ఎన్ని కలలు కాంటాడో వాటి చుట్టూ అల్లుకున్నాడు. రెండో కథలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. పర్ఫెక్ట్ పార్ట్నర్ అనేది కేవలం మన మిత్ మాత్రమే. మనమే అవతలి వాళ్లకు తగ్గట్టు మారిపోవాలి అని ఈ కథలో చెప్పిన విధానం బాగుంది. మూడో కథ సముద్రఖని ఆకట్టుకుంటుంది. పంచతంత్రం సినిమాకు ప్రాణం చివరి రెండు కథలు. వీటిని దర్శకుడు హర్ష చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాలుగో కథలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంతో అద్భుతంగా చూపించాడు హర్ష. భార్య కోసం భర్త పడే ఆవేదన.. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఇందులో బాగా కుదిరింది. చివరి కథ ఎంతో హృద్యంగా ఉంటుంది. కలర్స్ స్వాతి ఈ పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది. ఓవరాల్ గా పంచతంత్రం నెమ్మదిగా సాగిన మంచి ఎమోషనల్ డ్రామా.

నటీనటులు:

ఐదు కథల్లో ఉన్న నటీనటులు అద్భుతంగా నటించారు. మొదటి కథలో నరేష్ అగస్త్య, శ్రీవిద్య.. రెండో కథలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్.. మూడవ కథలో సముద్రఖని, దివ్యవాణి.. నాలుగో గదిలో దివ్య శ్రీపాద, వికాస్.. ఐదవ కథలో కలర్స్ స్వాతి, ఉత్తేజ్ చాలా బాగా నటించారు. వీళ్ళందరి కథలు చెప్పే పాత్రలో డాక్టర్ బ్రహ్మానందం సరికొత్త కోణంలో కనిపించారు.

టెక్నికల్ టీం:

పంచతంత్రం నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కూడా ఆకట్టుకుంటాయి. శ్రవణ్ భరద్వాజ్, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం ఆకట్టుకుంది. రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ బాగుంది. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ కాస్త నెమ్మదిగా ఉంది. దర్శకుడు హర్ష పులిపాక రాసుకున్న కథలు బాగున్నాయి. వాటిని చెప్పిన విధానం కాస్త నెమ్మదిగా ఉంది.

పంచ్ లైన్:

పంచతంత్రం.. పంచేంద్రియాలను స్పృశించే ఎమోషనల్ డ్రామా..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!