AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: ఆ పని మాత్రం చేయొద్దు.. డైరెక్టర్ హరీష్ శంకర్‏కు పవన్ ఫ్యాన్ సూసైడ్ నోట్..

తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాను హరీష్ రీమేక్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రూమర్స్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచన మానుకోవాలని..

Pawan Kalyan: ఆ పని మాత్రం చేయొద్దు.. డైరెక్టర్ హరీష్ శంకర్‏కు పవన్ ఫ్యాన్ సూసైడ్ నోట్..
Pawan Kalyan
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2022 | 12:56 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు సినిమాలతో.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న పవన్.. ఇటీవలే సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ నటించనున్నట్లు ఆధికారిక ప్రకటన ఇచ్చేశారు మేకర్స్. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక మరోవైపు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి పలు రకాల వార్తలు నెట్టింట ప్రచారం జరుగుతున్నాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాను హరీష్ రీమేక్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ రూమర్స్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచన మానుకోవాలని.. ఆ మూవీ రీమేక్ అంటూ ప్రకటన మాత్రం రావొద్దంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి డిమాండ్ చేస్తున్నారు.

దీంతో నెట్టింట #WeDontWantTheriRemake హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ హరీష్ శంకర్‏కు సూసైడ్ నోట్ రాశారు. “ఇప్పటివరకు ఒక్క లెటర్ రాయని నేను సూసైడ్ లెటర్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు ఎన్ని రీమేక్స్ తీసినా ఎప్పుడూ ఇంత ఫీలవ్వలేదు. కానీ తేరి రీమేక్ అని తెలిశాక రాయకతప్పలేదు. కనీసం నా చావుని చూసైనా తేరీ రీమేక్ క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్ రెడీ ప్రతి ఆదివారం టైమింగ్స్ మార్చి టీవీల్లో తేరిసినిమాను వేస్తున్నారు. ప్లీజ్ సార్.. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయండి. నా చావుకు కారణం మైత్రీ మూవీ మేకర్స్ టీమ్.. డైరెక్టర్ హరీష్ శంకర్. చిన్న మనవి.. అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోకండి”. అంటూ రాశారు. ఇప్పటివరకు ఈ ట్వీట్‏కు వందల్లో రీట్వీట్స్ వచ్చాయి. మరోవైపు అభిమాని రాసిన సూసైడ్ లెటర్‏ను వాడేస్తూ.. మాకు తేరి రీమేక్ వద్దు అన్నయ్య… అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఒకవేళ తేరి రీమేక్ ప్రకటన వస్తే మాత్రం నెగిటిట్ ట్రెండ్ చేస్తామంటూ ట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి తేరి రీమేక్ అనౌన్స్ మెంట్ రాకముందే నెట్టింట ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడం కొత్తేమి కాదు. ఇటీవల మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేసి భీమ్లా నాయక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో రానా దగ్గుబాటి.. నిత్యా మీనన్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో