AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamannah : వాళ్లు నా మ్యారెజ్ ఫిక్స్ చేశారు.. పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా…

గుర్తుందా శీతాకాలం మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వ్యక్తిగత విషయాలతోపాటు.. తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది తమన్నా.

Tamannah : వాళ్లు నా మ్యారెజ్ ఫిక్స్ చేశారు.. పెళ్లి గురించి ఓపెన్ అయిన తమన్నా...
Tamannah
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2022 | 7:32 AM

Share

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో తమన్నా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఎఫ్ 3 సినిమాతో థియేటర్లలో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన చిత్రాల్లో గుర్తుందా శీతాకాలం ఒకటి. డైరెక్టర్ నాగశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. వ్యక్తిగత విషయాలతోపాటు.. తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది తమన్నా.

తమన్నా మాట్లాడుతూ.. ” కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటివరుక నన్ను నేను స్టార్ గా భావించలేదు. ఇప్పుడు అలా చూసుకోవాలని అనుకోవడం లేదు. నన్ను నేను ఓ మంచి నటిగానే చూసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఇలా ఉండగలిగితే ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించగలను. నా పాత్ర నిడివిని దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడూ సినిమా ఎంచుకోను. కథలో నాలుగైదు సన్నివేశాలున్నా.. ఆ పాత్ర ప్రభావం బలంగా ఉంటే చాలు. సైరాలో నా పాత్ర నిడివి తక్కువే. కానీ ఆ పాత్ర తాలూకూ ప్రభావం క థలో చాలా బలంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక నా పెళ్లి గురించి ఇప్పటికే బోలెడన్ని వార్తలొచ్చాయి. కొన్ని మీడియా సైట్స్ నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. ఓ డాక్టర్ తో వివాహం జరిగినట్లు రాశారు. త్వరలోనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు వదంతులు వచ్చాయి. పెళ్లి అనేది జీవితంలో ఒక అందమైన భాగం. అలాంటి సందర్భం వస్తే దాన్నొక వేడుకలా అందరికీ తెలిసేలాగా చేసుకుంటా.అందరి ఇళ్లలో లాగానే మా ఇంట్లో వాళ్లూ పెళ్లి చేసుకోమని అడుగుతుంటారు. అలాగని నన్నేమీ తొందర పెట్టలేదు. ఎందుకంటే వాళ్లకు నా లక్ష్యాల ప్టల పూర్తి స్పష్టత ఉంది.” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.