Aishwarya Lekshmi: గుడిలో అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

కొద్ది రోజులుగా తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఐశ్వర్య.. తనకు చిన్నతనంలో ఎదురైన చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. ఓ ఆకతాయి తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని.. గుడిలోనే వేధింపులకు గురి చేశాడని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

Aishwarya Lekshmi: గుడిలో అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
Aishwarya Lekshmi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2022 | 8:52 AM

మట్టీ కుస్తీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ. ఇటీవల పొన్నియిన్ సెల్వన్, అమ్ము, కుమారి సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఒకే ఏడాది ఐదు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటికే ఈ అమ్మడుకు మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఐశ్వర్య.. తనకు చిన్నతనంలో ఎదురైన చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. ఓ ఆకతాయి తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని.. గుడిలోనే వేధింపులకు గురి చేశాడని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

“ప్రతి మహిళ తన జీవితంలో ఏదో ఒక చెడు స్పర్శను అనుభవించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది వారికి ఎప్పుడూ పెద్ద సమస్యే. నాకు కూడా అలాంటి అనుభవం ఎదురైంది. చిన్నప్పుడు కేరళలోని గురువాయూర్ లో ఓ సంఘటన జరిగింది. ఇప్పటికీ అది నాకు గుర్తుంది. అక్కడి గురువాయుర్ ఆలయానికి వెళ్లినప్పుడు చిన్నపిల్లగా ఉన్న నాతో ఓ ఆకతాయి యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ పార్ట్స్ తాకి దురుసుగా ప్రవర్తించాడు. ఆరోజు నేను పసుపు రంగు దుస్తులు ధరించాను. అప్పటి నుంచి ఆ రంగు బట్టలు వేసుకోవాలంటే భయపడతాను. ఆ సమయంలో నేను చిన్నపిల్లను.. నాతో అలా ప్రవర్తించడం పట్ల రియాక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు నాకు ఏ భయం లేదు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన సినిమా ప్రమోషన్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పుడు నేను రియాక్ట్ కాగలను. ఇలాంటి సంఘటనలు మహిళలు ఎప్పుడూ వెంటే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు నేను ఎక్కువగా పసుపు రంగు దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపిస్తున్నాను. మనం సమాజంలో ఇలాంటి సమస్యలకు ఎప్పుడూ మార్పు వస్తుందో తెలియదు. ఇటీవల వచ్చిన గార్గి సినిమా కూడా ఇలాంటి సమస్య గురించి చర్చించినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు .. అనుభావాలు ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడుతుంటారు ” అంటూ చెప్పుకొచ్చింది. మలయాళీ స్టార్ విష్ణు విశాల్ తో కలిసి మట్టీ కుస్తీ సినిమాలో ఐశ్వర్య నటించింది.

View this post on Instagram

A post shared by Aishwarya Lekshmi (@aishu__)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!