Venkatesh: వెంకటేశ్ బర్త్ డే స్పెషల్.. థియేటర్లలోకి వచ్చేస్తున్న నారప్ప.. రిలీజ్ ఎప్పుడంటే..

ఈ సినిమాను తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం అసురన్ కు రీమేక్ గా తెరకెక్కించారు. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Venkatesh: వెంకటేశ్ బర్త్ డే స్పెషల్.. థియేటర్లలోకి వచ్చేస్తున్న నారప్ప.. రిలీజ్ ఎప్పుడంటే..
Narappa
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2022 | 7:32 AM

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాల రి రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే గతంలో సూపర్ హిట్ చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం. స్టార్ హీరోస్ పుట్టినరోజు సందర్భంగా వారికి సంబంధించిన సినిమాలు.. లేదంటే సదరు మూవీ రిలీజ్ అయి 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ చిత్రాలను ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్ స్టార్స్ పుట్టినరోజు సందర్భంగా వారి హిట్ సినిమాలను రి రిలీజ్ చేశారు మేకర్స్. అయితే విక్టరీ వెంకటేష్ విషయంలో అలా కాకుండా ఓటీటీ లో విడుదలైన సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. అదే నారప్ప. థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తి చూపించిన ప్రేక్షకులకు నిరాశ కల్గిస్తూ.. ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం అసురన్ కు రీమేక్ గా తెరకెక్కించారు. ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ మూవీ బాక్సా ఫీస్ వద్ద సందడి చేయనుంది. విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకీ కథానాయుకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’. లాక్ డౌన్ పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ‘నారప్ప’ థియేటర్స్ విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో వెంకీ భార్యగా ప్రియమణి కనిపించగా.. నారప్ప పెద్ద కుమారుడిగా కార్తీక్ రత్నం, చిన్న కొడుకుగా రాఖీ కనిపించారు. ఇందులో నాజర్, రావు రమేష్, రాజీవ్ కనకాల , బ్రహ్మాజీ, ఝాన్సీ కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా?రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్
మీ అకౌంట్ డీ యాక్టివేట్ అయ్యిందా?రీ యాక్టివేట్ చేయడం చాలా సింపుల్