Bigg Boss 6 Rohith: అలా ఎవరు చేశారో అర్థం కాలేదు.. కంప్లైంట్ కూడా చేశాం.. రోహిత్‌కు ఓటు వేయండి.. మెరీనా రిక్వెస్ట్..
ఇప్పుడిప్పుడే విన్నర్ మెటీరియల్ రోహిత్ అంటూ పేరు వినిపిస్తోంది. గత రెండు వారాల నుంచి రోహిత్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తన ఆట తీరుకు ఆడియన్స్ మద్దతు కూడా లభిస్తూ..టైటిల్ రేసులో టాప్ 2లో నిలుస్తున్నాడు.
బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలేకు చేరువలో ఉంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అయిన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు మిగిలారు. ఇప్పుడు ఉన్నవారందరూ టైటిల్ రేసులో ఉన్నవారే. ఇందులో రోహిత్ ఒకరు. ముందు నుంచి సైలెంట్ గా ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అమ్మాయిల నిర్ణయాలకు గౌరవమిస్తూ.. పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతూ.. అనవసర గొడవలకు వెళ్లకుండా ఆట.. మాట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేవంత్ అని అంతా అనుకుంటున్న సమయంలో ఇప్పుడిప్పుడే విన్నర్ మెటీరియల్ రోహిత్ అంటూ పేరు వినిపిస్తోంది. గత రెండు వారాల నుంచి రోహిత్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తన ఆట తీరుకు ఆడియన్స్ మద్దతు కూడా లభిస్తూ..టైటిల్ రేసులో టాప్ 2లో నిలుస్తున్నాడు. అయితే బిగ్ బాస్ ముగింపు వచ్చే సమయంలో రోహిత్ కు షాక్ తగిలింది.
రోహిత్ ఇన్ స్టా డిజైబుల్ అయ్యింది. అతని ఖాతాలో ఎలాంటి అప్డేట్స్ కనిపించకపోగా.. అకౌంట్ మొత్తం హ్యాక్ అయ్యింది.. బిగ్ బాస్ కు సంబంధించినవి మాత్రమే కాకుండా.. పాత ఫోటోస్.. వీడియోస్ కూడా కనిపించడం లేదు. దీంతో రోహిత్ కు ఓటు వేయాలనుకునే అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. రోహిత్ భార్య మెరీనా తన ఇన్ స్టాలో వీడియో షేర్ చేసింది.
“ఇది చాలా సాడ్ న్యూస్. రోహిత్ ఇన్ స్టా అకౌంట్ డిజైబుల్ అయ్యింది. ఎందుకు ఇలా అయ్యింది ? ఎవరు చేశారు అన్నది అర్థం కావడం లేదు. మేం కంప్లైంట్ చేశాం. 24 గంటల్లో యాక్టివేట్ అవుతుందని చెప్తున్నారు. అప్పటివరకు నా ఇన్ స్టా అకౌంట్లో రోహిత్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. ఆ అకౌంట్ ను ఫాలో అ వ్వండి. దయచేసి రోహిత్ కు ఓటు వేయడం ఆపొద్దు. ఎందుకంటే ప్రతి ఓటు చాలా విలువైనది. రోహిత్ కు సపోర్ట్ చేయండి. ” అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.