Raviteja: హీరోయిన్ శ్రీలీలపై మస్ మాహారాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..
తాజాగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు రవితేజ. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. రావణసుర, టైగర్ నాగేశ్వర రావు, ధమాకా చిత్రాలతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ధమాకా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మూవీ యూనిట్.. అటు ఆన్ లైన్.. ఆఫ్ లైన్ రెండింటిలోనూ పూర్తిస్తాయి ప్రమోషన్ లను ప్రారంభించింది. తాజాగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు రవితేజ. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ధమాకా సినిమాలో కామెడీ టైమింగ్ తోపాటు… అభిమానులు ఆశించే మా స్ స్టెప్ప్.. కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయని అన్నారు. అలాగే ఈ మూవీలో తనకు జింతాక్ సాంగ్ ఇష్టమని అన్నారు. ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నానని.. థియేటర్లలో అదిరిపోతుందని.. అందరూ ఎంజాయ్ చేస్తారని అన్నారు. అలాగే హీరోయిన్ శ్రీలీల గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగ్గా.. ఆమె అత్యంత ప్రతిభశాలి అంటూ చెప్పకొచ్చారు.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన శ్రీలీలా కథానాయికగా నటిస్తోంది.
A bundle of talent!#AskRaviteja #Dhamaka #DhamakaFromDec23 https://t.co/3XR9sqQDGL
— Ravi Teja (@RaviTeja_offl) December 9, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.