AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: కాంతార వివాదం పై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక.. నన్నెవ్వరూ బ్యాన్ చేయలేదు అంటూ ..

రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదాలపై స్పందించారు రష్మిక.. తనను ఎవ్వరూ బ్యాన్ చేయలేదని.. వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు పెట్టలేనంటూ చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna: కాంతార వివాదం పై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక.. నన్నెవ్వరూ బ్యాన్ చేయలేదు అంటూ ..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2022 | 10:33 AM

Share

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్. ఈ మూవీతో దేశంలోనే కాకుండా ప్రపంవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో అటు దక్షిణాదిలోనే కాకుండా.. బీటౌన్‏లోనూ వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక.. ఇటీవల కొద్ది రోజులుగా వివాదాలతో ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్.. ప్రవర్తనతో ఈ ముద్దుగుమ్మను కొందరు తెగ ట్రోల్ చేశారు. సొంత పరిశ్రమను ఆమె మరిచిపోయిందని.. అహంకారి అంటూ ముఖ్యంగా కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదాలపై స్పందించారు రష్మిక.. తనను ఎవ్వరూ బ్యాన్ చేయలేదని.. వ్యక్తిగత విషయాలను కెమెరా ముందు పెట్టలేనంటూ చెప్పుకొచ్చింది.

గతంలో కాంతార సినిమా విడుదలైన కొత్తలో ఈ మూవీ చూశారా అని ఓ విలేకరి అడగ్గా చూడలేదు అని తెలిపింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కన్నడలో బ్లా్క్ బస్టర్ హిట్.. మీరు ఇంకా చూడలేదా ? అంటూ ట్రోల్ చేశారు. ఇక ఆ తర్వాత పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనను పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ వేళ్లతో చూపించింది. ఇక రష్మిక తీరుపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రిషబ్ శెట్టి సైతం రష్మికకు కౌంటరివ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదం పై స్పందించిన రష్మిక వివరణ ఇచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

“కాంతార సినిమా విడుదలైన కొత్తలో మూవీ చూశారా ? అని అడిగారు.. అప్పటికీ ఇంకా చూడలేదు. కాబట్టి లేదు అని చెప్పాను. ఆ తర్వాత చూసి చిత్రబృందానికి మెసేజ్ పెట్టాను. థాంక్యూ అని రిప్లై కూడా ఇచ్చారు. కానీ బయట ప్రచారం అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. నా జీవితంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలీదు. ఇన్ సైడ్ ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు. నా వ్యక్తిగత జీవితంలో జరిగేది ప్రతిసారి కెమెరా పెట్టి చూపించలేను. ప్రతి మెసేజ్ సోషల్ మీడియా లో పెట్టలేం. నా పర్సనల్ లైఫ్ గురించి జనాలు ఏం మాట్లాడుకున్న నాకు అవసరం లేదు. నా వృత్తికి సంబంధించి ఏం చెప్తున్నారో దాన్ని తీసుకుంటాను. అందుకు తగినట్టు పనిచేస్తాను.వృత్తి పరంగా నేను ఏం చేస్తున్నానో ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

Follow Us
సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా..
సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా..
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి పెంచకపోవడానికి.
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
టిఫిన్ బాక్స్‌తో ముంబై ట్రైన్ ఎక్కాడు.. కట్ చేస్తే.. రూ.42 వేల..
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
ఇదెక్కడి మాస్ రా మావా.. చిరుతతో సరదాగా హోలీ ఆడిన ఊరి జనం.. వీడియో
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
విజయ్ విడాకుల విషయంలో వేణు స్వామి సంచలన కామెంట్స్..
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
చిన్నస్వామి గడ్డపై మళ్ళీ కోహ్లీ గర్జన..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పండుగ
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..