మరో హిట్ కోసం రెడీ అయిన శ్రీనిధి శెట్టి.. వెంకీ సినిమాతో గ్యారెంటీ  

17 August   2026

Rajeev 

Pic credit - Instagram

ఇతరభాషల నుంచి వచ్చి తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. వారిలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి ఒకరు. 

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్టే.

ఇప్పటివరకు ఈ హీరోయిన్ ఐదు సినిమాలు చేసింది. అందులో ఏకంగా 4 సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి.

మధ్యలో ఆమె చేసిన కోబ్రా, తెలుసుకదా సినిమాలు మాత్రమే యావరేజ్ గా ఆడాయి. కానీ ఈ అమ్మడి క్రేజ్ తగ్గలేదు.

ప్రస్తుతం ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ – 47’ లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో స్వర్ణ అనే పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ చూస్తుంటే ఈ అమ్మడికి మరో హిట్ ఖాయంగా కనిపిస్తుంది.

ఇక నెట్టింట ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన క్రేజీ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది.