హీరో సిద్ధార్థ్ ఎవర్ గ్రీన్ గ్లామర్.. సీక్రెట్ ఇదే!
17-08-2026
Pic credit - Instagram
Phani Ch
హీరో సిద్ధార్థ్ ఇప్పటికీ అంతే యంగ్‌గా, ఎవర్ గ్రీన్‌గా ఎలా కనిపిస్తారో తెలుసా? ఆయన గ్లామర్ మరియు ఫిట్‌నెస్ వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో ఓ ప్రెస్ మీట్‌లో సరదాగా పంచుకున్నారు!
సినిమాల్లోకి రాకముందు తన లైఫ్‌స్టైల్ చాలా సాధారణంగా ఉండేదని, ఎండలో తిరుగుతూ మామూలుగా గడిపానని సిద్ధార్థ్ చెప్పారు.
నటుడిగా మారిన తర్వాత సెట్స్‌లో తమను ఫ్రిజ్‌లో దాచిన తాజా ఆపిల్ పండులా చాలా భద్రంగా చూసుకుంటారని ఆయన చమత్కరించారు.
ఏమాత్రం ఎండ తగలకుండా, ఎలాంటి అలసట రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. మేకప్ వేయడం మరియు చర్మం పాడవకుండా రక్షించడం వంటివి హీరోల గ్లామర్ మెయింటెనెన్స్‌లో భాగమని సిద్ధార్థ్ పేర్కొన్నారు.
కాబట్టి తనలా నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు ఆపిల్‌లా ఎంతో గారాబంగా, జాగ్రత్తగా చూసుకోవాలంటూ అభిమానులను నవ్విస్తూ సరదా పంచ్ వేశారు సిద్ధార్థ్
అయితే అసలైన ఫిట్‌నెస్ మరియు ముఖ వర్చస్సు పెరగడానికి ప్రతీ ఒక్కరి ఒక సింపుల్ హెల్త్ సీక్రెట్‌ను చెప్పారు.. అదే సరైన నిద్ర మరియు మానసిక ప్రశాంతత అని స్పష్టం చేశారు.
రాత్రిపూట ఎలాంటి ఆందోళనలు, ఒత్తిళ్లు లేకుండా కనీసం 8 గంటల పాటు ప్రశాంతంగా గాఢ నిద్ర పోవడం చాలా ముఖ్యం. మనస్సు హాయిగా ఉన్నప్పుడే శరీరంలోని కణాలు రీఛార్జ్ అవుతాయని సిద్ధార్థ్ చెప్పారు.
అలాగే ఉదయం లేచినప్పుడు కూడా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా రోజును ప్రారంభిస్తే మీ ముఖంలో సహజమైన గ్లో ఎప్పటికీ తగ్గదు. మనసు ఆహ్లాదంగా ఉంటేనే ముఖ వర్చస్సు దానంతట అదే మెరుస్తుందని తెలిపారు.