ఆ స్టార్ హీరో రేంజ్  చూసి చాలా భయమేసింది : నభా నటేష్ 

17 August   2026

Rajeev 

Pic credit - Instagram

హీరోయిన్ గా బిజీ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది ఆ అందాల భామ నభా నటేష్.. నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది

నన్నుదోచుకుందువటే సినిమా కంటే ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార.

ఇక పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ ముద్దుగుమ్మ.

ఈ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా ఆకట్టుకుంది. అందంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది నభా నటేష్

రీసెంట్ గా నాగబంధం సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో తన తొలి సినిమా షూటింగ్ అనుభవం గురించి ఆమె మాట్లాడారు.

శివరాజ్ కుమార్ స్థాయిని చూసి మొదట్లో చాలా భయం వేసిందని, అప్పట్లో మాస్ లక్షణాలు ఉన్న ఒక క్లిష్టమైన పాత్రను చేశానని నాభా తెలిపింది.