Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందం.. అమ్మ చెప్పిన చిట్కానే రహస్యం అంటున్న సీనియన్ హీరోయిన్ భాగ్యశ్రీ..

53 ఏళ్ల వయసులోనూ వన్నె తరగని అందంతో చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది. అయితే తన అందానికి రహస్యం మాత్రం అమ్మ చెప్పిన చిట్కా అంటూ అసలు విషయం చెప్పేసింది.

Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందం.. అమ్మ చెప్పిన చిట్కానే రహస్యం అంటున్న సీనియన్ హీరోయిన్ భాగ్యశ్రీ..
Bhagyashree
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 09, 2022 | 12:14 PM

సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీ అంటే చాలా మందికి తెలియదు.. కానీ.. మైనే ప్యార్ కియా హీరోయిన్ అంటే ఠక్కున అందమైన రూపం కళ్ల ముందుకు వచ్చేస్తుంది. మొదటి సినిమాతోనే సల్మాన్ ఖాన్ సరసన నటించి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమెనే.. బాలీవుడ్ హీరోయిన్ భాగ్య శ్రీ. ఈ మూవీ తెలుగులో ప్రేమ పావురాలు టైటిల్ తో విడుదలై విజయం అందుకుంది. మరాఠా రాజకుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేసింది. ముందుగా బుల్లితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెండితెరపై ప్రేక్షకులను అలరించింది. పెళ్లి తర్వాత చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న భాగ్య శ్రీ.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో డార్లింగ్ తల్లిగా కనిపించింది. 53 ఏళ్ల వయసులోనూ వన్నె తరగని అందంతో చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది. అయితే తన అందానికి రహస్యం మాత్రం అమ్మ చెప్పిన చిట్కా అంటూ అసలు విషయం చెప్పేసింది.

“ఓట్స్ గ్రైండ్ చేసి అందులో పాలు.. తేనె కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేసుకుని తడి ఆరే వరకు ఉంచుకుంటాను.. ముఖం కడుక్కునే ముందు ముఖంపై ఎండిన పేస్ట్ రాలిపోయే విధంగా మృదువుగా వేళ్లతో స్క్రబ్ చేసుకుంటాను. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటాను. ఓట్స్ తో మృత కణాలను తొలగించే లక్షణం ఉంటుంది. పాలు తేమనిచ్చి చర్మం మృదువుగా టోన్ అయ్యేలాగా చేస్తాయి. యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ ఫ్ల మేటరీ గుణాలుంటాయి. ఇవన్నీ కలిసి అలసిన చర్మా న్ని కొద్దిసేపట్లోనే తాజా పిరిచి ముఖానికి మెరుపునిస్తాయి” అంటూ తన అందానికి సిక్రెట్ రివీల్ చేశారు భాగ్య శ్రీ.

ఇవి కూడా చదవండి

ఓ వైపు సినిమాలు.. బుల్లితెరపై రియాల్టీ షోలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీ విషయాలే కాకుండా.. సినిమా అప్టేట్స్ ఇస్తూ.. ఎప్పటికప్పుడూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది భాగ్య శ్రీ. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 16 వేదికపై సల్మాన్ తో కలిసి సందడి చేసింది భాగ్య శ్రీ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.