Yashoda Movie: అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసిన ‘యశోద’.. ఎక్కడ చూడొచ్చు అంటే..

ఇప్పటివరకు ఈ మూవీ రూ. 33 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా సమాచారం. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్నాక .. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తుంది.

Yashoda Movie: అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి వచ్చేసిన 'యశోద'.. ఎక్కడ చూడొచ్చు అంటే..
Yashoda ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 09, 2022 | 10:52 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సరోగసి నేపథ్యంలో వచ్చిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో సామ్ ప్రెగ్నెంట్ మహిళగా కనిపించింది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామ్ నటనపై మరోసారి ప్రశంసలు కురిపించారు సినీ విమర్శకులు. యాక్షన్ సీన్లలో సామ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. డైరెక్టర్స్ హరి అండ్ హరీష్ తెరకెక్కించిన ఈ సినిమా సమంత కెరీర్‏లోనే భాహీ హిట్‏గా నిలిచింది. ఇప్పటివరకు ఈ మూవీ రూ. 33 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా సమాచారం. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్నాక .. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తుంది.

సామ్ కెరీర్ లోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురువారం అర్దరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయ్చొచ్చు. అలాగే డిజిటల్ ప్లాట్ ఫాంలో కూడా సామ్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

కొద్దిరోజులుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది. ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.