IPS Amit Lodha: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకుని.. ఖాకీ వెబ్ సిరీస్‌తో ఫేమస్.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అమిత్
ఖాకీ ది బిహార్ చాప్టర్.. వెబ్ సిరీస్‌తో బాగా పాపులరైన ఐపీఎస్ అధికారి అమిత్ లోదా వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఏంటీ వెబ్ సిరీస్. ఐపీఎస్ లోఢాకి లింకేంటి?
OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఖాకీ ది బిహార్ చాప్టర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది. ఈ వెబ్ సిరీస్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా జీవితం ఆధారంగా రూపొందించించబడింది.. అవినీతి, అక్రమాలను అరికట్టడంలో నేరస్థుల పాలిట సింహ స్వప్నం అనే పేరు సంపాదించుకున్న అమిత్ పై ప్రస్తుతం అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవును బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోఢా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ పలువురు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఖాకీ ది బిహార్ చాప్టర్ అనే వెబ్ సిరీస్‌తో ఈ అధికారి పేరు సంచలనమైంది. తన జీవితంలోని ఓ కీలక ఘట్టాన్ని గర్తు చేసుకుంటూ స్వయంగా రాసిన బిహార్ డైరీస్ పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. అయితే తన పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో అమిత్ కోటి రూపాలకు ఒప్పందం చేసుకున్నారు. ఆయన భార్య బ్యాంకు ఖాతాకు 49 లక్షలు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. సిరీస్ ఒప్పందానికి ముందే ఖాతాలో నగదు జమైందని గుర్తించారు.
మగధ్ రేంజ్‌కు అమిత్ ఐజీగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందన్నారు. గయలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నియమితులైనప్పటి నుంచి లోఢా అక్రమంగా సంపాదిస్తున్నారని, అతని పుస్తకాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు అనుమతి ఉండదని అమిత్‌పై ఫిర్యాదు వచ్చింది. బిహార్‌లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారి.. ఒకే రోజు 24 హత్యలకు కారణమైన అశోక్ మహతోను అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రం నుంచి దేశ వ్యాప్తంగా అమిత్ ధైర్యానికి తగిన గుర్తింపు లభించింది. మూడు నెలల పాటు పోలీసులతో దొంగ పోలీసు ఆట ఆడుతూ వచ్చిన మహతోను అమిత్ అరెస్టు చేశారు. ఇదే అంశంతో అమిత్ పుస్తకం రాయగా.. ఈ పుస్తకాన్ని ఆధారంగా ఓ వ్యక్తిని పోలీసు అధికారి ఎలా పట్టుకున్నారనే కథాంశంతో ‘ఖాకీ’ సిరీస్ రూపొందింది. ఇప్పుడు ఈ సిరీసే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..