Kantara: సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్.. ఓటీటీలో మాత్రం తేలిపోయిన కాంతారా

అదుర్స్ అంతే.. రిషబ్ శెట్టి అరిపించాడు.. నెక్ట్స్ లెవల్ సినిమా.. ఇవి కాంతారాను థియేటర్‌లో చూసినవాళ్లు చెప్పిన మాటలు. కానీ మూవీ ఓటీటీకి వచ్చాక సిట్యూవేషన్ మారిపోయింది.

Kantara: సిల్వర్ స్క్రీన్‌పై సెన్సేషన్.. ఓటీటీలో మాత్రం తేలిపోయిన కాంతారా
Kantara Varaha Roopam
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 09, 2022 | 12:47 PM

ఇండియన్ స్క్రీన్ మీద నయా సెన్సేషన్ కాంతార. వెండితెర మీద కాసుల పంట పండించిన ఈ సినిమా ఇటీవల డిజిటల్‌ ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే థియేట్రికల్ రిలీజ్‌లో భారీగా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్‌ను మాత్రం ఆ రేంజ్‌లో మెప్పించలేకపోతోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్‌ శెట్టి స్యయంగా దర్శకత్వం వహించి నటించిన సినిమా కాంతార. సాండల్‌వుడ్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా తరువాత నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ కాంతార వసూళ్ల సునామీ సృష్టించింది.

కలెక్షన్ల పరంగానే కాదు టాక్ పరంగానూ కాంతార కన్నడ సినిమా స్థాయిని ఎంతో పెంచింది. ఈ సినిమా కథా కథనాలు, హీరో పర్ఫామెన్స్‌ గురించి నేషనల్ లెవల్‌లో చర్చ జరిగింది. ఇంత హైప్ రావటంతో కాంతార ఆల్‌ టైమ్ క్లాసిక్‌ నిలుస్తుందని భావించారు ఇండస్ట్రీ జనాలు. డిజిటల్ రిలీజ్‌ తరువాత సీన్ మారిపోయింది. ఓవరాల్‌గా సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా… మరీ క్లాసిక్ అన్న రేంజ్‌ అయితే లేదంటున్నారు ఆడియన్స్‌. అసలు థియేట్రికల్‌లో రిలీజ్‌లో ఎందుకంత హైప్‌ క్రియేట్‌ చేశారో అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

కొంతమంది డిజిటల్ ఆడియన్స్‌ అయితే… ఓవర్‌ రేటెడ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ మొదలు పెట్టారు. క్లైమాక్స్ తప్ప సినిమా అంతా పరమ రొటీన్‌గా ఉందంటూ.. విమర్శలు చేస్తున్నారు. మరి ఈ టాక్ విషయంలో మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?