Naga Chaitanya: మునుపెన్నడూ చేయని పాత్రలో అక్కినేని యంగ్ హీరో.. సక్సెస్ కొట్టేనా

ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చెడ్డా సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకూడా డిజాస్టర్ అయ్యింది.

Naga Chaitanya: మునుపెన్నడూ చేయని పాత్రలో అక్కినేని యంగ్ హీరో.. సక్సెస్ కొట్టేనా
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2022 | 7:10 AM

యంగ్ హీరో నాగచైతన్య సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ, ఆ తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమాల తర్వాత మళ్లీ హిట్ రుచిచూడలేదు చైతూ.. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చెడ్డా సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. మరోసారి విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమాకు దూత అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. దూత వెబ్ సిరీస్ లో మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మునుపెన్నడూ చేయిని పాత్రలో కనిపించనున్నాడట ఈ కుర్ర హీరో.

ఈ వెబ్ సిరీస్ లో చైతన్య బాబు అనే జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. ఇప్పటివరకు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయని చైతూ మొదటిసారి ఇలా నెగిటివ్ రోల్ చేస్తున్నాడట. ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ కోసం ఎంత రిస్క్ అయినా చేసే పాత్రలో చైతన్య కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ లో చైతన్య నటన  నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. విక్రమ్ సరికొత్త కథతో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నాడట. ఈ సిరీస్ ఖచ్చితంగా విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి