AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ఇది బన్నీ నామ సంవత్సరం.. రికార్డులన్నీ దాసోహం.. ఐకాన్ స్టార్ అంటే అట్లా ఉంటది

బన్నీ దుమ్ము లేపుతున్నాడు. రికార్డులన్నీ తన పేరుతో లిఖించుకున్నాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ నటించిన పుష్ప సాంగ్స్ నెక్ట్స్ లెవల్‌లో సత్తా చాటాయి. ఈ ఏడాది అగ్ర తాంబూళం అందకున్నాడు.

Allu Arjun: ఇది బన్నీ నామ సంవత్సరం.. రికార్డులన్నీ దాసోహం.. ఐకాన్ స్టార్ అంటే అట్లా ఉంటది
Actor Allu Arjun
Ram Naramaneni
|

Updated on: Dec 09, 2022 | 7:21 PM

Share

2022 క్లైమాక్స్‌కు వచ్చేసింది. దీంతో ఈ ఏడాదిలో మన హీరోలు సెట్ చేసిన రికార్డ్స్‌ను రీకాల్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ముఖ్యంగా డిజిటల్ జమానాలో సోషల్ మీడియాలో సత్తా చాటిన స్టార్స్ గురించి స్పెషల్‌గా డిస్కషన్‌గా జరుగుతోంది. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందున్నారు.. పాన్ ఇండియా పుష్పరాజ్‌. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఎన్నో మ్యూజికల్‌ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే వీటిలో నేషనల్‌ లెవల్‌లో హయ్యస్ట్ వ్యూస్‌ సాధించి టాప్‌లో ట్రెండ్ అయిన సాంగ్స్‌ లిస్ట్‌ను రిలీజ్ చేసింది యూట్యూబ్‌. ఈ లిస్ట్‌లో ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ టాప్ ప్లేస్‌లో నిలిచారు.

టాప్‌ టెన్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్ వీడియోస్‌ లిస్ట్‌లో నాలుగు పాటలు అల్లు అర్జున్‌వే కావటం విశేషం. సౌత్‌లో మాత్రమే కాదు నార్త్‌లోనూ తన హవా చూపించారు బన్నీ. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ 600 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఆల్‌ టైమ్‌ రికార్డ్ సెట్ చేసింది. శ్రీవల్లితో పాటు సామి సామి, ఊ అంటావా పాటలు కూడా టాప్‌ టెన్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లో స్థానం సంపాదించాయి. పుష్ప హిందీ వర్షన్‌ నుంచి ఊ బోలేగా సాంగ్‌ కూడా ఈ లిస్ట్‌లో ఉండటంతో బాలీవుడ్‌లోనూ బన్నీ మేనియా పీక్స్‌లో ఉందంటోంది అల్లు ఆర్మీ.

అల్లు అర్జున్ తరువాత టాప్‌ టెన్‌ లిస్ట్‌లో స్థానం సంపాధించిన మరో సౌత్‌ హీరో దళపతి విజయ్‌. బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు లిరికల్ వీడియోతో పాటు వీడియో సాంగ్‌ కూడా టాప్‌ ట్రెండింగ్ లిస్ట్‌లో కనిపించింది. సౌత్ నుంచి ఈ రెండు సినిమాలు మాత్రమే యూట్యూబ్‌ ట్రెండింగ్ వీడియోస్‌ లిస్ట్‌లో ఉండటంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ గ్రాండ్‌ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో