Tollywood: బ్లాక్ డ్రెస్లో కవ్విస్తోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఇండస్ట్రీలో చాలా స్పెషల్ ఈ అమ్మడు..
పైన ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాదిలో వరుస సూపర్ హిట్స్ అందుకున్న చిన్నది కూడా ఈ ముద్దుగుమ్మే. ఎవరో గుర్తుపట్టండి.
కొద్ది రోజులుగా నటీనటుల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తమ బాల్యం తాలుకూ జ్ఞాపకాలను ఫాలోవర్లతో షేర్ చేసుకోవడమే కాకుండా.. ఫ్యామిలీ విషయాలను.. సినిమా అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే.. కొందరు తారల క్రేజీ ఫోటోస్ ఫాలోవర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అలాంటి వాటిలో పైన కనిపిస్తున్న ఫోటో కూడా ఒకటి. పైన ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి. వైవిధ్యమైన సినిమాలను.. పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాదిలో వరుస సూపర్ హిట్స్ అందుకున్న చిన్నది కూడా ఈ ముద్దుగుమ్మే. ఎవరో గుర్తుపట్టండి.
ఈ హీరోయిన్.. మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ. 2014లో మోడల్ గా కెరీర్ ఆరంభించి.. జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆక్షన్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఇటీవల విడుదలైన అమ్ము సినిమాతో నటనపరంగా ప్రశంసలు అందుకుంది ఐశ్వర్య.
అలాగే డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోనూ నటించింది. అలాగే సాయి పల్లవి నటించి గార్గి చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించింది. తాజాగా ఇప్పుడు మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది. హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.