Ram Pothineni: ఉస్తాద్ రామ్ వస్తువుల ఇంత కాస్ట్లీనా..!! ధర తెలిస్తే దిమాక్ ఖరాబ్ కావాల్సిందే..
ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రామ్ తన కెరీర్ లో మొదటి సారి ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే లింగు స్వామి దర్శకత్వంలోని వారియర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. రామ్ తన కెరీర్ లో మొదటి సారి ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఊర మాస్ మసాలా మూవీ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు బోయపాటి శ్రీను. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇదిలా ఉంటే తాజాగా రామ్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గడ్డం తో చాలా రఫ్ గా కనిపిస్తున్నాడు రామ్. అలాగే రామ్ ధరించిన డ్రస్ ధర నెటిజన్లను షాక్ అయ్యేలా చేస్తోంది.
ట్రెండీ కాస్ట్యూమ్స్, గాగుల్స్, గడ్డంతో రగ్డ్ లుక్‌తో అదిరిపోయాడు.తాజాగా రామ్ విజయవాడలో సందడి చేశారు. ఓ షాప్ ఓపినింగ్ కు రామ్ చాలా స్టైలిష్ లుక్ లో వచ్చాడు. రామ్ ధరించిన వాటిలో పిఎస్ పాల్ స్మిత్ ఆబ్‌స్ట్రాక్ట్ ప్రింట్ షర్ట్ ఒకటి దీని ధర అక్షరాలా రూ. 18,500.. ఇక షూస్ క్రిస్టియన్ లౌబౌటిన్ లూయిస్ స్పైక్స్.. దీని ధర రూ. 77,036..ఇలా బ్రాండ్స్ తో మతిపోగొడుతున్నాడు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో సరికొత్త రామ్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు.. ఈ మూవీ ఇద్దరికీ కమ్ బ్యాక్ ఇచ్చింది.. ‘రెడ్’ లో డ్యుయెల్ రోల్‌తో ఆకట్టుకున్నాడు..ఇక ఇప్పుడు బోయపాటితో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.