Bigg Boss Telugu: బిగ్ ట్విస్టే ఇది.. హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

ఇక ఈ వారం కూడా అదే మాదిరిగా ఊహించని ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. హౌస్‌లో ప్రస్తుతం ఉన్న ఏడుగురులో ఈవారం ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. శ్రీహాన్‌కి టికెటు ఫినాలే పాస్ రావడంతో ఆతడు ఈ వారం ఎలిమినేషన్ లో లేడు.

Bigg Boss Telugu: బిగ్ ట్విస్టే ఇది.. హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 10, 2022 | 6:40 AM

బిగ్ బాస్ సీజన్ 6  చివరి అంకానికి వచ్చేసింది. ఇక హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోతారు. టాప్ 5లో ఎవరు ఉంటారు. విన్నర్ ఎవరు అవుతారు అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్ లో ఎలిమినేషన్ ను మాత్రం ఊహించలేం.. హౌస్ లో ఖచ్చితంగా ఉంటారు అనుకున్న వాళ్ళే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఇక ఈ వారం కూడా అదే మాదిరిగా ఊహించని ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. హౌస్‌లో ప్రస్తుతం ఉన్న ఏడుగురులో ఈవారం ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. శ్రీహాన్‌కి టికెటు ఫినాలే పాస్ రావడంతో ఆతడు ఈ వారం ఎలిమినేషన్ లో లేడు. ఇక మిగిలిన ఆరుగురు రేవంత్, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ నామినేషన్స్‌లో ఉన్నారు.  ఓటింగ్‌లో ఈ ఆరుగురు గట్టిగా పోటీ పడుతున్నారు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. గ్రాండ్ ఫినాలేకి వెళ్లేది ఐదుగురు మాత్రమే. దాంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఓటింగ్ లో ప్రస్తుతానికి రేవంత్ టాప్ లో ఉన్నాడని తెలుస్తోంది. రేవంత్ తర్వాత రోహిత్, ఇనాయ, ఆది రెడ్డి, శ్రీ సత్య ఉన్నారు చివరి స్థానంలో కీర్తి ఉన్నదని తెలుస్తోంది.

కీర్తికి.. శ్రీసత్యకి ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. గత కొద్దీ వారాల్లో శ్రీ సత్య గేమ్ మెరుగుపడింది. ప్రతి టాస్క్ లో చాలా ఎఫర్ట్స్ పెడుతూ వస్తోంది. కీర్తి కూడా తన శక్తి మేరకు కష్టపడింది. కీర్తి, శ్రీసత్య ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. అయితే వీరిలో కీర్తి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిందని సమాచారం. మరి చూడాలి ఏంజరుగుతుందో..

ఇవి కూడా చదవండి