AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: షాకింగ్.. హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ ?.. అసలు ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్..

మొత్తం 21 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతానికి ఏడుగురు మిగిలారు. ఇందులో ఈవారం నామినేషన్లలో రేవంత్, కీర్తి , శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ , రోహిత్ ఉన్నారు. ఇక టికెట్ టు ఫినాలే రావడంతో శ్రీహాన్ ఈవారం నామినేషన్స్ నుంచి మినహాయింపు

Bigg Boss 6 Telugu: షాకింగ్.. హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ ?.. అసలు ట్విస్ట్ ఇచ్చిన బిగ్‏బాస్..
Bigg Boss 6
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2022 | 4:12 PM

Share

బిగ్ బాస్ హౌస్.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. మొదటి నుంచి ఫిజికల్ గా ఆడినా.. జాగ్రత్తగా మైండ్ ఉపగించి ఆడినా ఎప్పుడు ఎలిమినేట్ అయ్యేది మాత్రం ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా ఈ సీజన్‏లో మాత్రం చెప్పడం కష్టమే. స్టార్ట్ అయిన మొదటి వారంలో అట్టప్లాప్ షో అంటూ ముద్ర వేసుకుంది బిగ్ బాస్ సీజన్ 6. ఈసారి ఎంచుకున్న కంటెస్టెంట్స్.. వాళ్లు ఆడుతున్న తీరు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు. కనీసం రోజూ సాగదీసే సీరియల్స్ స్థాయిలో కూడా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ రావడం లేదని ముందునుంచి వినిపిస్తోన్నదే. మొత్తం 21 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతానికి ఏడుగురు మిగిలారు. ఇందులో ఈవారం నామినేషన్లలో రేవంత్, కీర్తి , శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ , రోహిత్ ఉన్నారు. ఇక టికెట్ టు ఫినాలే రావడంతో శ్రీహాన్ ఈవారం నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. అయితే ముందు నుంచి ఈ వారం అతి తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్‏లో ఉన్నది కీర్తి. ఆ తర్వాతి స్థానంలో శ్రీసత్య నిలిచింది.

ఇక టాప్ 1లో రేవంత్ ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో శ్రీహాన్.. తర్వాత ఇనయ.. నాల్గవ స్థానంలో రోహిత్.. ఐదవ స్థానంలో ఆదిరెడ్డి ఉన్నారు. ఈ వారం కీర్తి ఎలిమినేట్ కానుందని అంతా అనుకున్నారు. ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం కూడా కీర్తి అందరి కంటే చివరి స్థానంలో ఉండగా.. ఆమె కచ్చితంగా ఇంటి నుంచి బయటకు వెళ్తుందనుకున్నారు. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే కీర్తితో పాటు శ్రీసత్య వెళ్లడం ఖాయంగా కనిపించింది. కానీ అలా జరగుకుండా బిగ్ బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఓటింగ్ లెక్కలన్నింటినీ పక్కనపెట్టేసి.. ఇనయను ఎలిమినేట్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ఫిజికల్ టాస్కులలో ఫర్ఫెక్ట్ గా ఆడి అబ్బాయిలకు గట్టి పోటీనిచ్చింది ఇనయ. ముఖ్యంగా రేవంత్, శ్రీహాన్‏తో ఇనయ గొడవ.. ఒకానొక సమయంలో ఒంటరి పోరాటం చేసింది. హౌస్ మొత్తం తనదే తప్పు అంటున్న.. ఏమాత్రం తగ్గకుండా అందరికీ గట్టి కౌంటరిచ్చింది ఇనయ. అంతేకాకుండా.. చివరి వారం కెప్టెన్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం ఇనయ ఇంటి నుంచి బయటకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీంతో బిగ్ బాస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇనయ ఎలిమినేషన్ పై స్పష్టమైన సమాచారం మాత్రం లేదు.