Balakrishna: మాస్ కమ్ కామెడీతో రచ్చ చేస్తారా?.. బాలయ్య-అనిల్ కాంబినేషన్‌ పై పీక్స్‌లో ఊహాగానాలు..

ఇప్పుడు బాలయ్య దారిలోకి అనిల్ వస్తున్నారా లేదంటే అనిల్ ఎంటర్‌టైన్మెంట్ స్కూల్‌లోకి బాలయ్య వెళ్తున్నారా..? ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమా ఏ జోనర్‌లో ఉండబోతుంది..? ఎవరి కోసం ఎవరు తమ స్టైల్ మార్చుకోబోతున్నారు..?.. ఇటీవలే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా

Balakrishna: మాస్ కమ్ కామెడీతో రచ్చ చేస్తారా?.. బాలయ్య-అనిల్ కాంబినేషన్‌ పై పీక్స్‌లో ఊహాగానాలు..
Balakrishna, Anil Ravipudi
Follow us

|

Updated on: Dec 10, 2022 | 12:01 PM

ఎన్నో రోజులుగా అభిమానులు వేచి చూస్తున్న బాలయ్య, అనిల్ రావిపూడి సినిమా మొదలైంది. అయితే ఇక్కడే అందరికీ ఓ అనుమానం వస్తుంది. ఇప్పుడు బాలయ్య దారిలోకి అనిల్ వస్తున్నారా లేదంటే అనిల్ ఎంటర్‌టైన్మెంట్ స్కూల్‌లోకి బాలయ్య వెళ్తున్నారా..? ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమా ఏ జోనర్‌లో ఉండబోతుంది..? ఎవరి కోసం ఎవరు తమ స్టైల్ మార్చుకోబోతున్నారు..?.. ఇటీవలే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఎఫ్ 3 సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. బాలయ్యతో ఎలాంటి జోనర్ సినిమా రూపొందించనున్నారనేది ఇప్పుడు నందమూరి అభిమానులలో నెలకొన్న సందేహం.

బాలయ్య ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 7న వీరసింహారెడ్డికి గుమ్మడికాయ్ కొట్టిన ఈయన.. ఆ మరుసటి రోజే అనిల్ రావిపూడి సినిమాకు కొబ్బరికాయ్ కొట్టేసారు. ఎన్నో రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉన్న ఈ కాంబినేషన్‌కు ముహూర్తం పెట్టేసారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి అంటేనే ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమాల్లో యాక్షన్ ఉన్నా.. మెయిన్ స్ట్రీమ్ మాత్రం కామెడీనే. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తోనూ సరిలేరు నీకెవ్వరులో కామెడీనే ఎక్కువ చేయించారు అనిల్. అలాంటిదిప్పుడు బాలయ్యతో చేయబోయే సినిమా జోనర్ ఏంటా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి సమాధానం యాక్షన్ బొమ్మ అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

కెరీర్‌లో తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నారు అనిల్. ఈ లెక్కన దర్శకులను పూర్తిగా మార్చేస్తున్నారు బాలయ్య. గోపీచంద్ మలినేని కూడా వీరసింహారెడ్డిని యాక్షన్ జోనర్‌లోనే తీసుకొస్తున్నారు. ఇందులో ఏకంగా 12 ఫైట్ సీక్వెన్సులున్నాయని తెలుస్తుంది. దానికి ముందు బోయపాటి గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా అనిల్ సైతం బాలయ్య దారిలోకి వచ్చేసారు. 2023 సమ్మర్ రిలీజ్‌కు దీన్ని ప్లాన్ చేస్తున్నారు.

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్