AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: సౌత్ హీరోని రిక్వెస్ట్ చేస్తున్న జాన్వీ.. తన సినిమాలో ఛాన్స్ కావాలంటున్న బీటౌన్ బ్యూటీ..

స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌.. స్టార్ ఇమేజ్‌ అందుకోవటంలో మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నారు. సక్సెస్‌ పరంగా తన సినిమాలు భారీగా పెర్ఫామ్ చేయకపోయినా.. నటిగా మాత్రం ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు జూనియర్ అతిలోకసుందరి.

Janhvi Kapoor: సౌత్ హీరోని రిక్వెస్ట్ చేస్తున్న జాన్వీ.. తన సినిమాలో ఛాన్స్ కావాలంటున్న బీటౌన్ బ్యూటీ..
Janhvi Kapoor
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2022 | 3:11 PM

Share

అతిలోక సుందరి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌… కెరీర్‌ స్టార్టింగ్ నుంచి సౌత్ డెబ్యూ విషయంలో ఊరిస్తూనే ఉన్నారు. నాకు సౌత్ సినిమా చేయాలనుందంటూ చెబుతూ వస్తున్న ఈ భామ.. ఇంతవరకు ఏ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా సౌత్‌ ఎంట్రీ విషయంలో మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు జాన్వీ కపూర్‌. స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌.. స్టార్ ఇమేజ్‌ అందుకోవటంలో మాత్రం ఇంకా తడబడుతూనే ఉన్నారు. సక్సెస్‌ పరంగా తన సినిమాలు భారీగా పెర్ఫామ్ చేయకపోయినా.. నటిగా మాత్రం ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు జూనియర్ అతిలోకసుందరి.

తొలి సినిమా దడక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్టార్‌ కిడ్‌ తరువాత డిఫరెంట్‌ మూవీస్‌తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. దీంతో అమ్మడి సౌత్ ఎంట్రీ ఎప్పుడన్న డిస్కషన్ చాలా రోజులుగా జరుగుతోంది. ఎన్టీఆర్‌, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమాలు ఉంటాయన్న టాక్ వినిపించినా… అఫీషియల్ క్లారిటీ మాత్రం ఇంతవరకు రాలేదు.

ఇవి కూడా చదవండి

తాజాగా తన సౌత్ ఎంట్రీ విషయంలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు జాన్వీ కపూర్‌. సౌత్‌ స్టార్ విజయ్‌ సేతుపతి అంటే తనకు ఎంతో ఇష్టమన్న ఈ బ్యూటీ… ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకునే ఛాన్స్ కావాలని స్వయంగా ఫోన్ చేసిన రిక్వెస్ట్ చేశారట. అయితే ఈ విషయంలో విజయ్‌ సేతుపతి రియాక్షన్ ఏంటి అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు జాన్వీ కపూర్‌.

తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు పడటంతో ఎక్కువగా విమెన్‌ సెంట్రిక్ కథలతోనే జాన్వీని అప్రోచ్ అవుతున్నారట మేకర్స్‌. దీంతో స్టార్ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకునే ఛాన్స్ మిస్ అవుతున్నారు ఈ స్టార్ కిడ్‌. లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేయాలన్న రూల్‌ పెట్టుకోకపోయినా… వస్తున్న అవకాశాలతో మాత్రం ఫుల్‌ హ్యాపీ అంటున్నారు ఈ స్టార్ వారసురాలు. ఫెమినిజం తన మనసుకు దగ్గరైన విషయం అని చెప్పటమే కాదు… ప్రజెంట్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గోల్డెన్ ఎరా నడుస్తుందని గర్వంగా ఫీలవుతున్నారు. మరి ఈ కామెంట్స్ తరువాత జాన్వీ కెరీర్‌ ఎలా టర్న్ అవుతుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.