Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sania Mirza: సానియాతో విడాకులపై తొలిసారి స్పందించిన షోయబ్‌.. ఇక ఇక్కడితో వదిలేయాలంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

సానియాతో విడాకుల వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు పాక్‌ సీనియర్‌ క్రికెటర్‌. ఇది మా వ్యక్తిగత విషయం. దీనిపై నేను కానీ, నా భార్య కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి' అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు షోయబ్‌.

Sania Mirza: సానియాతో విడాకులపై తొలిసారి స్పందించిన షోయబ్‌.. ఇక ఇక్కడితో వదిలేయాలంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Sania Mirza, Shoaib Malik
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2022 | 9:13 PM

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లు విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండగానే వీరిద్దరు క‌లిసి ఈ మ‌ధ్య ఓటీటీలో ది మీర్జా మాలిక్ అనే రియాలిటీ టాక్ షోలో పాల్గొన్నారు. దీంతో అస‌లు వీళ్లు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్న చాలామందిలో తలెత్తింద. మరోవైపు విడాకుల వ్యవహారంపై అటు సానియా కానీ, ఇటు షోయబ్‌ మాలిక్‌ కానీ ఇప్పటి వరకు నోరు విప్పిన దాఖలాలు లేవు. అయితే సానియాతో విడాకుల వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు పాక్‌ సీనియర్‌ క్రికెటర్‌. ఇది మా వ్యక్తిగత విషయం. దీనిపై నేను కానీ, నా భార్య కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి’ అని దాటవేత ధోరణి ప్రదర్శించాడు షోయబ్‌. కాగా సానియా దంపతుల మధ్య మధ్య మనస్పర్థలు రావడానికి షోయబ్ వివాహేతర సంబంధమే కారణమని పాక్ మీడియా పేర్కొంది.

గతేడాది షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి అయేషా ఒమర్‌తో హాట్ ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. అందులో వీరిద్దరూ స్విమ్మింగ్ పూల్ లో దిగిన హాట్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోలు అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లన్నింటినీ నటి అయేషా ఇటీవల ఖండించింది. కాగా 2010లో షోయబ్ మాలిక్, సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించగానే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలన్నింటినీ తట్టుకుంటూనే హైదరాబాద్‌ వేదికగా ఈ జంట పెళ్లిపీటలెక్కింది. 2018లో ఈ లవ్లీకపుల్స్‌కు ఇజహాన్‌ మీర్జా మాలిక్‌ పుట్టాడు. కాగా 12 ఏళ్ల పాటు కాపురం చేసిన ఈ దంపతులు విడిపోనున్నారని పాకిస్థానీ మీడియా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..