IND vs BAN: వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు.. రోహిత్ ప్లేసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయర్‌

ఈపరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా రోహిత్‌కు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడింది సెలెక్షన్‌ మేనేజ్‌మెంట్. ఇందులో భాగంగా బెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులో చేర్చారు .

IND vs BAN:  వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు.. రోహిత్ ప్లేసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ప్లేయర్‌
Rohit, Abhimanyu Easwaran
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2022 | 10:00 PM

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దీనికి తోడు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయం టీమిండియాను ఇబ్బందుల్లోకి నెట్టింది. చివరి వన్డే నుంచి తప్పుకున్న హిట్‌మ్యాన్‌ ఇప్పటికే ముంబై చేరుకున్నాడు. అయితే టెస్ట్‌ సిరీస్‌లో రోహిత్ ఆడాతాడా? లేదా? అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఈపరిస్థితుల్లో ముందు జాగ్రత్తగా రోహిత్‌కు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడింది సెలెక్షన్‌ మేనేజ్‌మెంట్. ఇందులో భాగంగా బెంగాల్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులో చేర్చారు . ఈశ్వరన్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్నాడు. భారత క్రికెట్‌ జట్టు -ఏకు ప్రాతినిథ్యం అద్భుతంగా ఆడుతున్నాడు. కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. ఇందులో మొదటి మ్యాచ్ చటోగ్రామ్‌లో జరుగుతుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం. దీని కోసం టీమ్ ఇండియా ఫైనల్స్‌కు చేరుకోవడానికి ఈ రెండు మ్యాచ్‌లతో సహా మిగిలిన అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించాలి.

ఈ పరిస్థితుల్లో కీలక ఆటగాళ్లు గాయపడటం టీమ్ ఇండియాకు కచ్చితంగా ఎదురుదెబ్బే. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ బొటన వేలికి గాయమైంది. దీంతో ముంబైలో అతనికి పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా రోహిత్ జట్టుకు కెప్టెన్‌గానే కాకుండా ఓపెనర్‌గా కూడా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 27 ఏళ్ల బెంగాల్ ఓపెనర్ ఈశ్వరన్‌కు జట్టులో అవకాశం కల్పించారు. కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్‌తో పాటు ఈశ్వరన్‌ను ఓపెనింగ్‌ స్లాట్‌లో ఆడించే అవకాశాలున్నాయి. కాగా ప్రస్తుతం బంగ్లాదేశ్ Aతో జరిగిన రెండు నాలుగు-రోజుల మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహించాడు కెప్టెన్‌. తొలి మ్యాచ్‌ డ్రా అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 123 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ల్లో ఈశ్వరన్‌ అద్భుతంగాబ్యాటింగ్‌ చేశాడు. తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 141 పరుగులు చేయగా, రెండో మ్యాచ్‌లో 157 పరుగులతో అద్భుత స్కోరు సాధించాడు. దీనికి ముందు, అతను విజయ్ హజారే ట్రోఫీలో సర్వీసెస్‌పై 122 పరుగులు చేశాడు.

రెండో టెస్టుకైనా..

మరోవైపు భారత సెలెక్టర్లు ప్రస్తుతం రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు, అయితే మొదటి టెస్టుకు కాకపోయినా రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ కోలుకుంటాడని, డిసెంబర్ 22 నుండి ఢాకాలో జరిగే మ్యాచ్‌లో తిరిగి కెప్టెన్సీ పగ్గాలు అందుకుంటాడని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..