AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veena Kapoor: ఆస్తి కోసం నటిని బ్యాటుతో కొట్టి హతమార్చిన తనయుడు.. షాక్‌కు గురైన సినిమా ఇండస్ట్రీ

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ సీరియల్‌ నటి వీణాకపూర్‌ ( 74 ) దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం కన్న కొడుకే ఆమెను బేస్‌బాల్‌ బ్యాట్‌తో దారుణంగా కొట్టి చంపేశాడు.

Veena Kapoor: ఆస్తి కోసం నటిని బ్యాటుతో కొట్టి హతమార్చిన తనయుడు.. షాక్‌కు గురైన సినిమా ఇండస్ట్రీ
Veena Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Dec 10, 2022 | 9:10 PM

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హిందీ సీరియల్‌ నటి వీణాకపూర్‌ ( 74 ) దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం కన్న కొడుకే ఆమెను బేస్‌బాల్‌ బ్యాట్‌తో దారుణంగా కొట్టి చంపేశాడు. ఇంట్లో పనిచేసే వ్యక్తి సాయంతో డెడ్‌ బాడీని దగ్గరలో ఉన్న నదిలో పడేశాడు. కొన్నిరోజుల క్రితం ఈ దారుణ హత్య జరగ్గా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ బుల్లితెర ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఆమెతో కలిసి నటించిన పలువురు బుల్లితెర నటీనటులు వీణాకపూర్‌కు నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మరోవైపు కన్నతల్లిని కనికరం లేకుండా హతమార్చిన వీణాకపూర్‌ కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. దాల్‌ ది గ్యాంగ్‌, బంధన్‌ ఫేరోన్‌ కే వంటి  వంటి బాలీవుడ్ హిందీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వీణాకపూర్‌. ఆమె ప్రస్తుతం ముంబైలోని జూహూ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది. ఆమె ఉంటున్న ఫ్లాట్‌ విలువే దాదాపు రూ.12 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే దీని విషయంలో ఆమె రెండో కుమారుడు సచిన్‌తో తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఆస్తికోసం కనికరం లేకుండా..

ఈ క్రమంలోనే ఒకరోజు వీణాకపూర్‌తో గొడవపడ్డ అతను.. ఆమెను బేస్‌బాల్‌ బ్యాట్‌తో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. అనంతరం తన ఇంట్లో పనిచేసే లాలాకుమార్‌ మండల్‌ సాయంతో వీణా కపూర్‌ మృతదేహాన్ని రాయ్‌గఢ్‌ జిల్లా మధేరా దగ్గర ఉన్న నదిలో పారేశాడు. అయితే కొద్దిరోజులుగా వీణాకపూర్‌ కనిపించకపోవడంతో అపార్ట్‌మెంట్‌ వాసులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఈ నెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వీణాకపూర్‌ అపార్ట్‌మెంట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆతర్వాత కుటుంబ సభ్యులు, బంధువులను విచారించగా అసలు విషయం బయటపడింది. ఆస్తికోసం కన్నకొడుకే వీణాకపూర్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సచిన్‌తో పాటు అతనికి సాయం చేసిన లాలాకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా విచారణలో సచిన్‌ తన తల్లిని చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఆస్తి గొడవల వల్లే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nilu Kohli (@nilukohli)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..