AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అబ్బాయిల పరువు తీసేశారు కదరా అయ్యా? ప్రేమించాలంటూ నడి రోడ్డుపై అమ్మాయిల కాళ్లు పట్టుకున్న విద్యార్థులు

అదేదో సినిమాలో చెప్పినట్లు అమ్మాయిల మనసులు గెలవాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరగాలి అన్నట్లు.. వారిని ఇంప్రెస్‌ చేసేందుకు అమ్మాయిలు ఎన్నో తంటాలు పడతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకే చెప్పకపోతే లైట్‌ అని వదిలేసేవారున్నారు కూడా కొందరున్నారు.

Watch Video: అబ్బాయిల పరువు తీసేశారు కదరా అయ్యా? ప్రేమించాలంటూ నడి రోడ్డుపై అమ్మాయిల కాళ్లు పట్టుకున్న విద్యార్థులు
Students
Basha Shek
|

Updated on: Dec 10, 2022 | 6:44 PM

Share

ఎదుటివారిపై తమ ప్రేమను వ్యక్తపర్చడానికి ఎన్నో మార్గాలు, దారులు ఉన్నాయి. కొందరు ప్రేమ లేఖలతో తమ ప్రేమను తెలియజేస్తే, మరికొందరు ఖరీదైన రింగ్స్‌, బహుమతులతో తమ ప్రియురాలు/ ప్రియుడిని ఇంప్రెస్‌ చేయాలనుకుంటారు. ఇంకొందరు ధైర్యంగా నేరుగా వెళ్లి తమ మనసులో మాటను ఎదుటివారికి తెలియజేయాలనుకుంటారు. సాధారణంగా అమ్మాయిలు అంత ఈజీగా అబ్బాయిలను నమ్మరు. అదేదో సినిమాలో చెప్పినట్లు అమ్మాయిల మనసులు గెలవాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు జరగాలి అన్నట్లు.. వారిని ఇంప్రెస్‌ చేసేందుకు అమ్మాయిలు ఎన్నో తంటాలు పడతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒకే చెప్పకపోతే లైట్‌ అని వదిలేసేవారున్నారు కూడా కొందరున్నారు. ఈనేపథ్యంలో తమను ప్రేమించాలంటూ నడిరోడ్డుమీద అమ్మాయిల కాళ్ల మీద పడ్డారు అబ్బాయిలు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఆన్‌లైన్లో తెగ వైరలవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముగ్గురు కాలేజీ అమ్మాయిలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటారు. వారిని ఫాలో అవుతూ ఇద్దరు అబ్బాయిలు వెనకాలే వెళుతుంటారు. ఎల్లో చుడీదార్ వేసుకున్న అమ్మాయికి ఓ అబ్బాయి ప్రేమలేఖ ఇస్తాడు. అమ్మాయి ఆ లెటర్ ను పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది. దీంతో తన ప్రేమని అంగీకరించాలని అబ్బాయి కోరతాడు. అయినా ఆ అమ్మాయి మిగతా ఇద్దరమ్మాయిలతో కలసి నడుచుకుంటూ ముందుకు వెళుతుంది. చివరకు తన ప్రేమకు ఓకె చెప్పాలంటూ అబ్బాయి హఠాత్తుగా ఆ అమ్మాయి కాళ్లు పట్టుకుంటాడు. వెంటనే ఆ అమ్మాయి తనను వదలాలంటూ నవ్వేస్తుంది. అయినా అతను ఆమె కాళ్లు వదల్లేదు. ఇంతలోనే మరో అబ్బాయి కూడా మరో అమ్మాయి కాళ్లు పట్టుకుని రోడ్డుపై పడుకుని ఉంటాడు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోని bihari.broo’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘పరువు తీసేశారు కదరా అయ్యా’ అంటూ అబ్బాయిలు చేసిన పనిపై చాలామంది ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఫ్రాంకా లేదా నిజంగా జరిగిందా అనేది తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Psycho Bihari (@bihari.broo)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..