5

Bigg Boss 6 Telugu: ఇనయ దెబ్బకు నోరుమూసిన యాంకర్.. మాటకు మాటకు ఇచ్చిపడేసింది..

ఇనయ అన్ ఫెయిర్ ఎలిమినేషన్.. చెత్త నిర్ణయం.. కావాలని ఆమెను బయటకు పంపేశారు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. దీంతో ఇనయ అన్ ఫెయి ర్ ఎలిమినేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది.

Bigg Boss 6 Telugu: ఇనయ దెబ్బకు నోరుమూసిన యాంకర్.. మాటకు మాటకు ఇచ్చిపడేసింది..
Bigg Boss 6 Inaya Sultana
Follow us

|

Updated on: Dec 12, 2022 | 3:52 PM

బిగ్ బాస్ సీజన్ 6.. అట్టర్ ప్లాప్. ఇదే మాట మొదటి వారం నుంచి వినిపిస్తోంది.. కంటెస్టెంట్ ఎంపిక.. వాళ్ళ ఆట తీరు.. హోస్టింగ్.. అన్ని ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇక ఎలిమినేషన్స్ లీక్స్..వారం వారం ముందుగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 6 నుంచి ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినా రాని రెస్పాన్స్ ఇనయ బయటకు రాగానే ట్విట్టర్ షేక్ అయ్యింది. ఇనయ అన్ ఫెయిర్ ఎలిమినేషన్.. చెత్త నిర్ణయం.. కావాలని ఆమెను బయటకు పంపేశారు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. దీంతో ఇనయ అన్ ఫెయి ర్ ఎలిమినేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. ఫైనల్ వరకు ఉంటుందనుకున్న ఇనయ ఇలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ కావడం ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. నిజం చెప్పాలంటే అందరి కంటెస్టెంట్స్ లో అందరికీ గట్టి పోటీనిచ్చింది ఇనయ. ఫిజికల్ టాస్కులలోనూ ఏమాత్రం వెనడుగు వేయకుండా పోరాడింది. చివరకు గుడ్ కెప్టెన్ గా అందరి మెప్పు పొందింది. అయితే ఎలిమినేట్ అనంతరం యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఇనయ. ఆమెకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఇక మరోసారి శివ తన వంకర ప్రశ్నలతో ఇనయకు ఇరిటేట్ చేశాడనే చెప్పుకొవాలి. ఒక్కో ప్రశ్నకు తన స్టైల్లో ఇచ్చిపడేసింది. ఇనయ మాటలకు ఎప్పుడూ మరో క్వశ్చన్ వేసే శివ సైతం సైలెంట్. ఎన్ని రకాలుగా తిప్పి తిప్పు ప్రశ్నలు అడిగినా.. సూటిగా ఆన్సర్ ఇచ్చేసింది ఇనయ. ప్రతిసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ నేనే అని అరిచేదానివి కదా అంటూ వెటకారంగా అడిగారు యాంకర్ శివ. దీంతో ఇనయ.. ఎవరికి వారు అలా అనుకుని ఆడితేనే కుదురుతుంది అనగానే.. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించలేదా అన్నాడు శివ. అది నామీద నాకున్న నమ్మకం అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది.

ఇనయ మొదటి వారంలోనే బయటకు వచ్చేస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత గ్రాఫ్ పెరిగింది. తర్వాత నెమ్మదిగా గ్రాఫ్ తగ్గింది. సూర్యతో లవ్ ట్రాక్ విషయంలో డౌన్ అయ్యింది అన్నాడు. దీంతో నేనెప్పుడైనా లవ్ అని చెప్పానా ? అంటూ తిరిగి ప్రశ్నించి షాకిచ్చింది. సూర్య గురించి బ్యాక్ బిచింగ్ ఎందుకు చేశావ్ అని అడగ్గానే నాకు కోపం వచ్చింది కాబట్టి మాట్లాడాను అని తెలిపింది.

ఇవి కూడా చదవండి

దీంతో నీకు నచ్చకపోతే ఎన్ని స్టేట్ మెంట్స్ అయిన వదులుతావు అని శివ అనగానే.. ఎన్ని స్టేట్మెంట్ కాదు.. నాకనిపించింది చెప్తాను అంటూ కౌంటరిచ్చింది. ఇక ఆ తర్వాత రేవంత్ ఫోటో చూపించి తన గురించి చెప్పమని అడగ్గా.. ‘ఆయన ఇప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు, కాసేపటి తరువాత ఇంకోలా బిహేవ్ చేస్తాడు’ అని చెబుతుంటే మధ్యలో శివ ‘నీలాగా’ అన్నాడు. అందుకు ఇనయ ‘తన గురించి అడిగావు, నా గురించి ఎందుకు తీసుకువస్తున్నావ్, తను నేను ఒకలాగే బిహేవ్ చేస్తామా’ అని పశ్నించింది. దానికి శివ ‘నాకు తెలీదమ్మా’ అన్నాడు. ‘తెలియనప్పుడు ఎందుకు చెప్పావ్’ అని అని సీరియస్ కాగానే.. శివ సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భోళా శంకర్ తర్వాత స్టైల్ మార్చిన చిరు.. ఆ చిత్రంలో ఆల కనిపించనున్
భోళా శంకర్ తర్వాత స్టైల్ మార్చిన చిరు.. ఆ చిత్రంలో ఆల కనిపించనున్
విశాఖలో కార్యాలయాల కోసం గుర్తించిన భవనాలు ఏవంటే..?
విశాఖలో కార్యాలయాల కోసం గుర్తించిన భవనాలు ఏవంటే..?
బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?
బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?
మెట్రో రైల్లో ఫన్నీ సీన్..రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి షాక్.!
మెట్రో రైల్లో ఫన్నీ సీన్..రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి షాక్.!
భయపెడుతున్న చంద్రముఖి 2 ట్రైలర్.. పొంగల్ రేసులో శివకార్తికేయన్..
భయపెడుతున్న చంద్రముఖి 2 ట్రైలర్.. పొంగల్ రేసులో శివకార్తికేయన్..
చై తో మరోసారి జాయిన్ అయ్యిన సాయి పల్లవి.. సెట్స్ లో సందడి.
చై తో మరోసారి జాయిన్ అయ్యిన సాయి పల్లవి.. సెట్స్ లో సందడి.
సిల్క్ చీరపై నూనె మరకలను ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు..
సిల్క్ చీరపై నూనె మరకలను ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు..
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు: సీఎం పినరయ్ విజయన్
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు: సీఎం పినరయ్ విజయన్
అభ్యర్థుల ప్రకటన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం
అభ్యర్థుల ప్రకటన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం
భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?
భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?