Rajinikanth Birthday: ఆ కార్లంటే అమితమైన ఇష్టం.. సూపర్ స్టార్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా ?..
సూపర్ స్టార్ రజీనికాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ఆస్తి వివరాలు తెలుసుకుందామా. ఒక్కో సినిమాకు తలైవా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా.
దక్షిణాది సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రజినీ కాంత్. ఓ సామాన్య కండెక్టర్ నటనపై ఆసక్తితో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి అగ్రకథానాయికుడిగా మారి.. వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. గత కొన్ని దశాబ్దలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను అలరించాడు. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలల్లోకి ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. 72 ఏళ్ల వయసున్న సూపర్ స్టార్ ఇప్పటివరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ డౌన్ టూ ఎర్త్ నటులలో రజినీకాంత్ ఒకరు. 1975లో సినీరంగ ప్రవేశం చేసినప్పటినుంచి ఇప్పటివరకు తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలోని అభిమానులు తలైవాను దైవంగా ఆరాధించడమే కాదు.. ఆయన సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.
అయితే సెలబ్రెటీ నెట్ వర్త్ ప్రకారం రజినీ కాంత్ ప్రస్తుతం ఆస్తి విలువ రూ. 430 కోట్లకు పైగానే ఉందట. 2018లో రూ. 50 కోట్లు వార్షిక ఆదాయం ఉన్న వారి జాబితాలో రజినీ 14వ స్థానంలో నిలిచారు. ఇక ప్రస్తుతం తలైవా నటిస్తున్న జైలర్ సినిమా కోసం రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో సూపర్ స్టార్ ఒకరు. అంతేకాకుండా ఆయనకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ పరిసరాల్లో పెద్ద భవనం ఉంది. ఇక్కడ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు, ఇతర సంపన్న వ్యక్తులు నివసిస్తుంటారు. ప్రస్తుతం రజినీ ఉంటున్న భవనం ఖరీదు రూ. 35 కోట్లు. అలాగే తన భార్య లత యాజమాన్యంలోని పలు పాఠశాలలో రజినీకి కూడా వాటా ఉంది.
ఇక తలైవాకు ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. కార్లకు వీరాభిమాని. అతని వద్ద రూ. 16.5 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్.. రూ. 6 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఉన్నాయి. అలాగే.. రూ. 67.90 లక్షలు నుంచి రూ.1.77 కోట్లు విలువైన BMW X5 ఉంది. అంతేకాకుండా.. రూ. 2.55 కోట్లు విలువైన మెర్సిడెస్. బెంజ్ జీ వ్యాగన్, రూ. 3.10 కోట్లు విలువైన లంబోర్ఘిని ఉరుస్, ప్రిమియర్ పద్మిని, టయోటా ఇన్నోవా, అంబాస్యాడ్ ఇన్నోవా ఉన్నాయి. అలాగే.. తలైవా వద్ద రూ. 5-6 కోట్ల విలువైన బెంట్లీ లిమోసిన్ ఉంది. రజినీ ప్రతిత సంవత్సరం ఒక్క సినిమాకు రూ. 50 నుంచి 60 కోట్ల వరకు వసూలు చేస్తారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీ కరిక్యులమ్ లోని కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు అనే శీర్షికలో రజినీ స్టోరీ ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.